Guppedantha Manasu: బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ రోజు రోజుకు ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంటుంది. ఇక నేటి ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగిందనే విషయాన్ని వస్తే… వసుధార తన గదిలో జరిగిన సంఘటన గురించి ఆలోచిస్తూ ఉంటారు. వసుధార భయపడుతూ ఉండగా ఎప్పటికప్పుడు ఇలాంటి విషయాలను మర్చిపోవాలి వసుధార అని రిషి తనకు ధైర్యం చెబుతాడు. ఇక మీరు ఏమి తినలేదు ఆపిల్స్ తినుఅని రిషి చెప్పగా అదేంటి సార్ మీరు కూడా తినలేదు కదా అనడంతో నీకు మాత్రమే ప్రేమ ఉందా నాకు నీపై ప్రేమ ఉంది అంటూ ఆపిల్స్ తింటూ ఉంటారు.
ఇలా వీరిద్దరు ప్రేమగా ఒకరికొకరు తినిపించుకుంటూ ఉండగా దేవయాని చూసి కోపంతో రగిలిపోతుంది.ఇక వసుధర బయటికి వెళ్లి రిషికి గుడ్ నైట్ చెప్పగా రిషి కూడా గుడ్ నైట్ చెబుతాడు. ఆ సమయంలో వసుధార కింద పడబోగా రిషి తనని పట్టుకుని ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇక రిషి మాట్లాడుతూ మనం ఇలా పక్కపక్కనే గడప అవతల నువ్వు ఇవతల నేను ఉంటూ గుడ్ నైట్ చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. త్వరలోనే మనిద్దరం ఒకే గదిలో పక్కపక్కనే ఉండి గుడ్ నైట్ చెప్పుకొనే రోజు రావాలని అనుకుంటున్నాను అని చెబుతాడు. వెళ్లి పడుకో వసుధార అని చెప్పగా నిద్ర రావడం లేదు సార్ అంటే జరిగిన విషయాన్ని తలుచుకోకుండా మన ప్రేమను తలుచుకొని కళ్ళు మూసుకొని నిద్ర వస్తుందని చెబుతాడు.
మరుసటి రోజు ఉదయం దేవయాని అందరిని పిలిచే రిషి పెళ్లి గురించి మాట్లాడుతుంది. అందరిని పిలిచిన తర్వాత దేవయాని మనం వీలైనంత తొందరగా వసుధార వాళ్ళ ఊరికి వెళ్లివాళ్ల తల్లిదండ్రులను తీసుకురండి మనం అన్ని విషయాలు మాట్లాడదాం అని చెప్పగా వసుధార టెన్షన్ పడుతుంది. ఏమైంది వసుధార అని దేవయాని అడగడంతో జగతి దగ్గరకు వెళ్లి మేడం ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో అంటూ వసుధార టెన్షన్ పడుతుంది.ప్రతి ఒక్క ఇంట్లోను సమస్యలు ఉంటాయి మన ఇంట్లో లేవా ఆ సమస్యలను దాటుకొని ముందుకు వెళ్లాలి. కొన్ని పద్ధతులు ఉంటాయి కదా అంటూ దేవయాని మాట్లాడుతుంది.
నేను బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను మీరు వెళ్లి మాట్లాడి రండి జగతి అని చెప్పగా వెంటనే రిషి వచ్చి మనం వారి ఊరికి వెళ్లాల్సిన అవసరం లేదు పెద్దమ్మ అంటూ దేవయాని వేసిన ప్లాన్ తిప్పి కొడతారు. వసుధర వాళ్ళ ఊరిలో వాళ్లు తల్లిదండ్రుల గురించి వాళ్ల పరిస్థితిల గురించి మనకు తెలుసు కాబట్టి మంచి రోజు చూసుకుని వారిని ఇక్కడికి రమ్మని చెప్పండి మాట్లాడి వెళ్తారు అనే రిషి చెబుతాడు. రిషి మాటలకు దేవయాని షాక్ అవుతుంది.ప్రస్తుత పరిస్థితులలో మనం అక్కడికి వెళ్లి వారిని ఇబ్బంది పెట్టకండి మా ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయి. ఇప్పుడు ముగిసిపోయే ప్రశాంతంగా ఉన్నాము అంటూ రిషి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ఇక వసుధార కిచెన్ లో కాఫీ చేస్తూ ఉండగా ధరిని వెళ్లి ఏంటి వసుధారా అప్పుడే నాకు పోటీగా వచ్చావా అని మాట్లాడుతుంది.ఆ మాటలకు వసుధార ధరణి వద్దకు వెళ్లి ప్రేమగా తనని హత్తుకుని నాకు మిమ్మల్ని అక్క అని పిలవాలని ఉంది మేడం అంటుంది.అలా అయితే ఇప్పుడే తనని అక్కయ్య అని పిలువు వసుధారా అని చెప్పగా ఇద్దరు సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు దేవయాని వీరిద్దరిని ఎలాగైనా విడగోడదాము అని ఆలోచిస్తుంటే మరింత దగ్గరవుతున్నారని మండిపడుతూ ఉండగా ధరణి వెళ్లి కాఫీ కావాలా అత్తయ్య అని తింగరి తింగరిగా మాట్లాడటంతో దేవయాని తనపై కోపం తెచ్చుకుంటుంది. దేవయాని మాటలకు ధరణి కన్నీళ్లు పెట్టుకుంటుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.