AP Politics: ఏపీ రాజకీయాలలో అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ వచ్చే ఎన్నికలలో గెలవడానికి ఎత్తులు పైఎత్తులు వేస్తోంది ప్రజా క్షేత్రంలో ముందుకు దూసుకుపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏకంగా 175 స్థానాల్లో గెలిచి అధికారంలోకి రావాలని వైసీపీ భావిస్తోంది. ఇక తెలుగుదేశం పార్టీ కూడా 150 స్థానాల్లో గెలవాలని వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఎవరి లక్ష్యాలు నిర్దేశించుకుని రాజకీయ రణక్షేత్రంలో ప్రజల మధ్య తిరుగుతూ ఉన్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో కొత్త రాజకీయం తెరపైకి వచ్చింది.
ఏపీలో ఉన్నా ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్షనేత చంద్రబాబుల్లో ఎవరు ధనవంతులు అనే చర్చ మొదలైంది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ప్రకారం దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రుల జాబితాలో వైఎస్ జగన్ మొదటి స్థానంలో ఉన్నారు. దీనిపై గత కొద్ది రోజులుగా తెలుగుదేశం, జనసేన పార్టీలు టార్గెట్ చేస్తున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి అంత కాస్ట్లీ అని విమర్శలు చేస్తున్నారు. దోచుకోవడమే పనిగా పెట్టుకున్న ముఖ్యమంత్రికి ప్రజల కష్టాలు ఇంకేం తెలుస్తాయి అంటూ టార్గెట్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు అదే సంస్థ దేశంలో అత్యంత ధనవంతులైన ఎమ్మెల్యేల జాబితాలో చంద్రబాబు నాయుడు మూడో స్థానంలో ఉన్నాడని పేర్కొంది. దీంతో ఇప్పుడు టీడీపీ పార్టీకి మాట రాకుండా అయిపొయింది. ఏదో ఒక విధంగా అధికార పార్టీ వైసీపీని టార్గెట్ చేద్దామని అనుకున్న టీడీపీకి ఇప్పుడు చంద్రబాబు కూడా ధనిక ఎమ్మెల్యేల జాబితాలో ఉన్నాడనే విషయం తెరపైకి రావడంతో సైలెంట్ అయిపోయారు. మొత్తానికి ఏపీలో రాజకీయ నాయకులు ఈ స్థాయిలో ధనవంతులుగా ఉన్నారు కాబట్టి డబ్బు పెట్టి ఓట్లు కొనడానికి వెనుకాడటం లేదనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది.
Night Sleep: మనం ఎంతో ఆరోగ్యంగా ఉండాలి అంటే తీసుకునే ఆహారం మాత్రమే కాకుండా మన శరీరానికి సరిపడా నిద్ర…
Ashada Amavasya 2026: మన హిందూ ధర్మ శాస్త్రంలో ఆచార్య వ్యవహారాలకు ఎంతో ప్రాధాన్యతను కల్పిస్తారు. ఈ నేపథ్యంలోనే ప్రతినెల వచ్చే…
Lemon Water: ఇటీవల కాలంలో చాలా మళ్లీ ఆరోగ్యం పై ఎంతో శ్రద్ధ వహిస్తున్నారు ఈ నేపథ్యంలోని ప్రతిరోజు ఉదయం…
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజు లక్షలాదిమంది భక్తుల స్వామి…
Coconut Water: కొబ్బరి నీళ్లలో సహజసిద్ధమైన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. కొబ్బరి నీళ్లలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం…
Pushpayagam Seva Tickets: తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి ఏడాది ఎంతో ఘనంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే ఈ…
This website uses cookies.