Health: శీతాకాలం వచ్చిందంటే దోమల బెడద ఎక్కువ అవుతుంది. పల్లెటూళ్ళ నుంచి పట్టణాల వరకు అన్ని ప్రాంతాలలో దోమల తాకిడి తీవ్రంగా ఉంటుంది. పరిసరాల పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేకపోవడం, అలాగే ఇంటి చుట్టూ పిచ్చి మొక్కలు ఎక్కువగా పెరగడం, అలాగే మురుగునీరు నిల్వ వలన దోమల ఎక్కువగా వ్యాపిస్తాయి. రాత్రి సమయాలలో ఫ్యాన్ లేకపోతే ఈ దోమలు ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వవు. ఈ దోమల కాటు వలన చాలా రకాల అనారోగ్యాల బారిన పడుతూ ఉంటారు. ఒక్కోసారి ఈ రోగాలు ప్రాణాంతకంగా కూడా మారుతాయి.
దోమల వలన సంక్రమించే వ్యాధుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక దోమల్ని నియంత్రించడానికి మస్కిటో కోయిల్స్ ఉపయోగిస్తూ ఉంటారు. వీటిని కాల్చి పెడితే దోమలు చనిపోతాయి. ఆ కోయిల్స్ నుంచి వచ్చే వాసన కారణంగా దోమలు చనిపోతాయి. లేదంటే బయటకి వెళ్లిపోతాయి. కానీ ఈ ఆ కోయిల్స్ దోమలతో పాటు మానవులకి కూడా కొత్తరకమైన అనారోగ్య సమస్యలని తీసుకొస్తాయి. ఊపిరితీత్తుల సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. దోమల్ని చంపడానికి పెట్టె కోయిల్స్ మనుషుల ప్రాణాలని కూడా తీసేసే పరిస్థితి తలెత్తుతుంది.
ఇక ఆల్ అవుట్ లిక్విడ్ తో కూడా అనారోగ్య సమస్యలు ఉంటాయి. మరి ఇవేవీ వాడకుండా దోమల్ని నియంత్రించడం ఎలా అనే డౌట్ అందరికి వస్తుంది. అయితే పూర్వకాలంలో గ్రామీణ ప్రాంతాలలో ఉన్నా కూడా దోమల బెడద తక్కువగా ఉండేది. దానికి కారణం ఇంటి చుట్టూ పెరిగే మొక్కలు. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న మొక్కలని పూర్వాశ్రమంలో ప్రజలు పెరట్లో పెంచేవారు. గాలితో పాటు ఆ మొక్కల నుంచి వచ్చే వాసనలు దోమల వ్యాప్తిని అరికట్టేవి. ముఖ్యంగా తులసి మొక్కలు పరిసరాలలో ఉన్నప్పుడు వాటి నుంచి ఓ రకమైన వాసన వస్తుంది. ఆ స్మెల్ గాలిని శుభ్రం చేయడంతో పాటు ప్రాణాంతకమైన జీవులని నాశనం చేస్తాయి.
అలాగే హానికర దోమలు కూడా తులసి మొక్క సువాసన వచ్చే పరిసరాలలోకి ప్రవేశించలేవు. అలాగే పుదీనా మొక్క ఇంట్లో ఉన్న కూడా దోమలు దాని నుంచి వచ్చే సువాసనని తట్టుకోలేవు. దీంతో ఆ మొక్కలని దోమల్ని నియంత్రించడానికి ఇంటి ఆవరణంలో పెంచుకుంటే మంచిది అని ఆయుర్వేద నిపుణుల మాట. ఈ మొక్కల ఆకులతో పాటు, కాండంలో కూడా ఔషధ గుణాలు ఉంటాయి. అలాగే ఆ మొక్క నుంచి వచ్చే సువాసనకి కూడా ఔషధగుణాలు ఉండటం వలన దోమలని ఇవి సమర్ధవంతంగా నియంత్రిస్తాయి. మరింకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ మొక్కలని తీసుకొచ్చి మీ ఇంటి వరండాలో కానీ, పెరట్లో కానీ పెంచుకోవడం స్టార్ట్ చేసేయండి.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.