Categories: News

ఆ ఛానళ్ళకు ఊరటనిచ్చిన ఢిల్లీ హైకోర్టు.. బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ కీలక ప్రకటన!

ఆంధ్రప్రదేశ్ లో గత నెల అనగా ఏప్రిల్ ఆరవ తేదీ నుంచి టీవీ9, సాక్షి టీవీ, ఎన్టీవీ న్యూస్ ఛానెల్‌ల ప్రసారాలు నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఢిల్లీ హైకోర్టు ఆగిపోయిన ఆ టీవీ ఛానల్ ప్రసారాలను మళ్లీ పునరుద్ధరించాలని ఆదేశించింది. ఈ విషయాన్ని ప్రశంసిస్తూ న్యూస్ బ్రాడ్ కాస్ట్ ఫెడరేషన్ ప్రకటన చేసింది. ఈ మేరకు న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ ప్రకటన విడుదల చేసింది. కాగా ఆ ప్రకటన ఆధారంగా చూసుకుంటే.. ఏపీలో వార్తా ఛానళ్ల ప్రసారాలను ఏకపక్షంగా, చట్టవిరుద్ధమైన నిలిపివేతను న్యాయస్థానం తీవ్రంగా ఖండించింది.

 

న్యాయ వ్యవస్థ ప్రజాస్వామ్య సమాజానికి మూలస్తంభాలైన వాక్ స్వాతంత్రం, భావప్రకటనా స్వేచ్ఛ, ప్రాథమిక సూత్రాలను బలోపేతం చేస్తుందని బ్రాడ్ క్యాస్ట్ ఫెడరేషన్ సభ్యులు ప్రకటించారు. జూన్ 6 నుంచి టీవీ9 తెలుగు, సాక్షి టీవీ, ఎన్టీవీ సహా పలు న్యూస్ ఛానెల్‌ల ప్రసారాలు ఏపీలో బ్లాక్‌ఔట్ కావడం పత్రికా స్వేచ్ఛపై తీవ్రమైన ఆందోళనలను రేకెత్తించింది. ఏపీ రాష్ట్రంలో రాజకీయ నాయకత్వంలో వచ్చిన మార్పు కారణంగా ఈ వార్తా ఛానళ్లను బ్లాక్ఔట్ చేయాలని కేబుల్ ఆపరేటర్లందరిపై ఒత్తిడి తీసుకురావడం తగదు.

 

టెలివిజన్ వినియోగదారుల పరంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అన్నది అతిపెద్ద మార్కెట్. ఇక్కడ సెట్ టాప్ బాక్స్ ద్వారా దాదాపు 65 లక్షల మంది వార్తలను వీక్షిస్తారని అంచనా. అంతేకాకుండా ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తున్న వార్తా ఛానెళ్లు కనీసం 62 లక్షల బాక్స్‌ల నుంచి తప్పించి, ప్రేక్షకులకు సమాచార హక్కును నిరాకరించే ప్రయత్నం జరగడం దురదృష్టకరమని అన్నారు. ఈ విషయంపై టీవీ9 పిటిషన్ దాఖలు చేస్తూ.. ఛానెల్స్‌ను డిస్‌కనెక్ట్ చేయడం చట్టవిరుద్ధమని, పంపిణీ సంస్థలతో కుదుర్చుకున్న ఇంటర్ కనెక్షన్ ఒప్పందానికి విరుద్ధంగా ఉంది అని పిటిషన్ లో పేర్కొంది. ఈ విషయంలో హైకోర్టు జోక్యం ప్రజాస్వామ్య పనితీరుకు అవసరమైన బహిరంగ, పారదర్శక మీడియా వాతావరణాన్ని నిర్వహించాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఏపీ ప్రజలు తమకు ఆసక్తి ఉన్న వార్తా చానెళ్లను వీక్షించే హక్కును కొనసాగుతుందని నిర్ధారిస్తూ అనధికారికంగా నిలిపివేయబడ్డ వార్తా చానెళ్లను పునరుద్దరించాలని ఈ ఉత్తర్వుల ద్వారా ఆదేశించింది.

Sravani

Recent Posts

ALLU ARJUN: AA22 టైటిల్ “రాకా”..ఇది ఎవరూ ఊహించనిది!

ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…

5 days ago

Ram Charan: ‘పెద్ది’ కథకి స్పూర్తి ఆమిర్ ఖాన్ సినిమాలేనా?

Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…

7 days ago

Chiranjeevi: విశ్వంభర మరింత ఆలస్యం..ఆ సినిమాలా అవుతుందా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…

1 week ago

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…

1 week ago

Peddi Movie: పెద్ది రిలీజ్ విషయంలో రామ్ చరణ్ చెప్పినా నమ్మని ఫ్యాన్స్!?

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…

1 week ago

Carmeni Selvam (2026) – Movie Review: కార్మేని సెల్వం బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌తో సాగిన చక్కటి కుటుంబకథా చిత్రం

Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…

1 week ago

This website uses cookies.