Gold: సాధారణంగా మహిళలకు ఆభరణాలే అలంకరణ, అందం అనే సంగతి మనకు తెలిసిందే అందుకే మహిళలు ఎన్నో విభిన్న రకాల నగలను కొనుగోలు చేస్తూ ఉంటారు. కానీ ఎన్ని నగలు ధరించిన మహిళలు మాత్రం కాళ్లకు బంగారు పట్టీలు వేసుకోరు. ఇలా బంగారు పట్టిలు వేసుకోకపోవడానికి గల కారణం వెనుక పురాణ గాధే ఉందని తెలుస్తోంది. మహిళలు వంటి నిండా బంగారం ధరించిన కాళ్లకు మాత్రం వెండి పట్టిలు మాత్రమే పెట్టుకుంటారు.
ఇలా వెండి పట్టీలు ధరించడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి వేడి మొత్తం తగ్గిపోయి ఆరోగ్యపరంగా మనకు మంచి కలుగుతుందని భావిస్తారు అందుకే వెండి పట్టీలు మాత్రమే వాళ్లకు ధరిస్తారు. ఇక బంగారం ఎంత ఉన్నా, కాళ్లకు మెట్టెలు గాను, పట్టీలుగా మాత్రం ధరించరు అలా ధరించడం వల్ల వారి జీవితం మొత్తం తలకిందులుగా మారిపోతుందని పండితులు చెబుతున్నారు.
బంగారం సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమని భావిస్తూ ఉంటారు. ఇలా లక్ష్మీ స్వరూపమైనటువంటి బంగారు ఆభరణాలు మన వంటిపై వేసుకున్న పర్వాలేదు కానీ కాళ్లకు వేసుకుంటే సాక్షాత్తు లక్ష్మీదేవిని అవమానించినట్టని పండితులు చెబుతున్నారు. అందుకే ఎప్పుడూ కూడా కాలి వేలకు మెట్టెలుగాను అలాగే పట్టీలు గాను బంగారు ఆభరణాలను ధరించకూడదని అలా ధరిస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అయ్యి సంపద మొత్తం పోగొట్టుకొని ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. అందుకే కాళ్లకు బంగారు పట్టీలు మాత్రం ధరించరు.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతీ ఒక్కరిలో ఉండే ఆతృత, ఆసక్తి ఊహించలేనిది. ఎన్ని సినిమాలు బాక్సాఫీస్…
*బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు *ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక Kadiri Narasimha Swamy: కదిరి, మార్చి…
Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…
Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…
Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…
Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…
This website uses cookies.