Garikapati – RRR: కవలకి కూడా ఇది సాధ్యం కాదు అంటూ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకుంటున్న ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాటపై గరికపాటి ఊహించని కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతకొన్ని రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి, గరికపాటి నరసింహారావు ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్‌తో అక్కడున్నవారు సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపించారు.
దీంతో చిరు కూడా కాదనలేక కాసేపు అభిమానులకి ఫొటోలు దిగేందుకు ముందుకొచ్చారు. కానీ, ఇది గరికపాటికి కోపం తెప్పించింది. కాసేపు చూసి సహనం కోల్పోయి మీరు ఆ సెల్ఫీలు ఆపితే నేను మాట్లాడతాను. లేదంటే లేచి వెళ్లిపోతానని స్పందించారు. అది అప్పట్లో మెగాస్టార్‌తో పాటు అందరికీ ఇబ్బంది కలిగింది. అయితే, ఆ తర్వాత దీనిపై మళ్ళీ గరికపాటి మాట్లాడుతూ, ఆయనదే పొరపాటు అని అలా మాట్లాడకుండా ఉండి ఉండాల్సింది.. అంటూ చెప్పుకొచ్చారు.
అప్పటి నుంచి కొందరు మెగా అభిమానుల్లో గరికపాటి అంటే కోపం ఉంది. కానీ, తాజాగా ఆయన ఆర్ఆర్ఆర్ సినిమా గురించి, దర్శకుడు రాజమౌళి హీరోలు రామ్ చరణ్, ఎన్.టి.ఆర్ పర్ఫార్మెన్స్ అలాగే నాటు నాటు పాటలో వాళ్ళ డాన్స్ గురించి మాట్లాడుతూ, ఇద్దరు హీరోలపై ప్రశంసలు కురిపించారు. కవలలు కూడా ఇంత పర్ఫెక్ట్‌గా డాన్స్ చేయలేరేమో అని అది కేవలం తారక్, చరణ్‌లకి మాత్రమే సాధ్యమైంది.. అని మాట్లాడారు.
గరికపాటి నరసింహారావు గారు చేసిన ఈ కామెంట్స్ అటు మెగా అభిమానుల్లో ఇటు నందమూరి ఫ్యాన్స్‌లో ఆనందాన్ని నింపాయి. దాంతో అందరూ గరికపాటిని పొగడ్తలతో ముంచేస్తున్నారు. కాగా, 95వ అకాడమీ అవార్డులు (ఆస్కార్ 2023) మార్చ్ 13న ప్రకటించబోతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు వారితో పాటుగా భారతీయులు కూడా ఆ పాటకు ఆస్కార్ అవార్డు రావాలని కోరుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.