Ganesh Pooja: ప్రతి ఏడాది భాద్రపద మాసంలో వచ్చే చతుర్దశి రోజున వినాయక చవితి వేడుకను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇక ఈ ఏడాది కూడా వినాయక చవితి పండుగను సెప్టెంబర్ 7వ తేదీ శనివారం జరుపుకోబోతున్న నేపథ్యంలో ఇప్పటికే ఎక్కడ చూసిన పండుగ వాతావరణం నెలకొంది. ఈ వినాయక చవితి రోజు ప్రతి ఒక్కరూ వారి ఇంట్లో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించుకుంటారు. అదే విధంగా వీధులలో కూడా పెద్ద ఎత్తున వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేసి పూజిస్తూ ఉంటారు. చతుర్దశి రోజు ఏర్పాటు చేసిన వినాయకుడిని దశమి వరకు ఉంచి నిమర్జనం చేస్తూ ఉంటారు.
ఇక వినాయక చవితి రోజున స్వామివారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలను సమర్పిస్తూ ఉంటారు. అదే విధంగా స్వామివారి అనుగ్రహం మనపై ఉండాలి అంటే వినాయకుడికి ఇష్టమైన పువ్వులను కూడా సమర్పించి పూజ చేయడం ఎంతో మంచిది. మరి వినాయక చవితి రోజు ఎలాంటి పువ్వులను సమర్పించాలి. ఎలాంటి పువ్వులంటే ప్రీతికరం అనే విషయానికి వస్తే..
వినాయకుడికి మందారం అంటే ఎంతో ప్రీతికరం ఎర్రటి మందారాలను పూజలో సమర్పిస్తే, అతను శ్రేయస్సును ప్రసాదిస్తాడు. మరియు శత్రువులను నాశనం చేస్తాడు.మల్లె పువ్వులు ఏడాది పొడవునా పూస్తాయి. గణేశ చతుర్థి నాడు ఈ పుష్పాన్ని సమర్పించడం వలన ఆయన ఆశీస్సులతో మన జీవితంలో సంతోషం శాంతి అనేవి ఉంటాయి.శని దేవునితో పాటు, సిద్ధిదాత గణేశుడికి నీలిరంగు శంకు పువ్వులు కూడా బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ పుష్పంతో పూజించడం వల్ల వివాహానికి పదేపదే ఆటంకాలు ఎదురైతే అది తొలగిపోతుంది.
ఇక మార్కెట్లో మనకు ఎంత విరివిగా లభించే పుష్పాలలో బంతి పువ్వులు కూడా ఒకటి బంతి పువ్వులు చాలామంది ఎక్కువగా అలంకరణ కోసం ఉపయోగిస్తూ ఉంటారు. అయితే వినాయకుడికి బంతి పువ్వు అంటే చాలా ఇష్టం ఈ బంతి పువ్వును కనుక స్వామి వారి పూజలో సమర్పించడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు . వీటితోపాటు పసుపు చేమంతి పూలు, పారిజాత పుష్పాలు అలాగే గరికను సమర్పించడం ఎంతో ముఖ్యం.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.