Ganesh Immersion : దేశంలో మరెక్కడా జరగని రీతిలో హైదరాబాదులో గణేష్ నిమజ్జన కార్యక్రమాలు జరుగుతాయి. భాగ్యనగరంలో జరిగే శోభాయాత్ర కన్నుల పండుగగా ఉంటుంది. నిమజ్జనం సందర్భంగా ఎక్కడి వాహనాలు అక్కడే గప్ చుప్ అన్నట్లు ఇళ్ళకే పరిమితమవుతాయి. భారీ వినాయక విగ్రహాల ఊరేగింపు రహదారులకు కొత్త శోభను అందిస్తాయి.
ఇన్నాళ్లు వీధి వీధి నా పూజలు అందుకున్న భారీ గణపయ్యలు మండపాలను వీడి డీజే చప్పుళ్లతో ఊరేగింపుగా బయలుదేరి నిమజ్జనం అవుతాయి. ఈ ఉత్సవాలను చూసేందుకు వేలాదిగా భక్తులు తరలి వస్తారు. వివిధ ఆకృతుల్లో ఉన్న గణపయ్యలను దర్శించుకుని తరించిపోతారు.
ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా
వినాయక విగ్రహాల నిమజ్జనానికి హైదరాబాద్ రెడీ అయ్యింది. అన్ని డిపార్ట్మెంట్లకు చెందిన అధికారులు అలెర్ట్ అయ్యారు నిమజ్జనానికి సంబంధించి సన్నాహాలు చేస్తున్నారు. లేటెస్ట్ గా ఇవాళ హైదరాబాద్ పోలీస్, భాగ్యనగర్ ఉత్సవ కమిటీ నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లపై భేటీ అయ్యాయి. నాంపల్లిలో జరిగిన ఈ సమావేశం లో లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పాల్గొన్నారు. ఉత్సవాల్లో పాల్గొనే వారికి పలు సూచనలు చేశారు.
“తెలంగాణ సర్కార్ గణేష్ నిమజ్జనానికి రూ.500 కోట్లు ఖర్చు చేస్తుంది. భక్తులకు అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ప్రయాణ సౌకర్యాల దగ్గరి నుంచి భద్రత వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనియ సంఘటనలు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నాం” అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.
నిమజ్జనం వేళ పాటించాల్సిన రూల్స్ ఇవే :
• శోభయాత్రలో డీజే పాటలు కాకుండా భక్తి పాటలు ఉంటే బాగుంటుంది.
• ఊరేగింపుల్లో, రథంపై మద్యం బాటిళ్లు ఉంటున్నాయని సమాచారం.అలా ఉంటే చర్యలు తప్పవు.
• టస్కర్ వెహికల్ లో పరిమితికి మించి జనం ఉండకూడదు.
• మధ్యాహ్నం 12 గంటల వరకు సౌత్ జోన్ దాటి విగ్రహాల ఊరేగింపు సాగాలి.
• నాన్ వెజ్ స్టాల్స్, లిక్కర్ అమ్మకాలు నిషేధం.
• గణేష్ ఊరేగింపులో పేపర్ గన్స్, పేపర్ హార్న్స్ వాడొద్దు.
• అల్లరి మూకలను కట్టడి చేసేందుకు షీ టీమ్స్ ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ ఉంటాయి.
• రూల్స్ కి వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.