Lord Ganesh: త్వరలోనే వినాయక చవితి పండుగ రానున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ పండుగ పనులలో నిమగ్నం అవుతున్నారు. ఇక ప్రతి ఒకరు కూడా తమ ఇంట్లో బొజ్జ గణపయ్యను ప్రతిష్టించి స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి ఉండ్రాళ్ళను చేసి నైవేద్యంగా పెడుతుంటారు. అలాగే వివిధ రకాల పండ్లను కూడా స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తుంటారు అయితే వినాయకుడు పూజలో మనం ఎన్నో రకాల వస్తువులను సమర్పిస్తూ ఉంటాము అయితే ఇవి లేకుండా మాత్రం వినాయకుడి పూజ ఎప్పుడు కూడా పరిపూర్ణం కాదని పండితులు చెబుతున్నారు. మరి ఆ వస్తువులు ఏంటి అనే విషయానికి వస్తే..
వినాయకుడి పూజలో మనం ఎన్నో రకాల నైవేద్యాలు పండ్లను సమర్పించిన ఆయన పూజకు దర్బగడ్డి లేకపోతే ఆ పూజ వ్యర్థమని చెప్పాలి. వినాయకుడికి దర్బగడ్డి ఎంతో ఇష్టమైనది అందుకే వినాయకుడి పూజలో తప్పనిసరిగా దర్బగడ్డి ఉండాలని ఇది లేకపోతే వినాయకుడి పూజ ఎప్పటికీ అసంపూర్ణమేనని పండితులు తెలియజేస్తున్నారు.అంతేకాదు గణపతికి ఉండ్రాళ్లు, కుడుములు అంటే చాలా ఇష్టం. అందువల్ల.. గణపతి పూజ సమయంలో నైవేద్య సమర్పణలో ఖచ్చితంగా కుడుములు, ఉండ్రాళ్లు ఏర్పాటు చేయండి. వీటిని సమర్పించిన భక్తుల పట్ల గణపతి సంతోషంగా ఉండి కోరిన కోరికలన్నీ తీరుస్తాడని విశ్వాసం.
ఇక వినాయకుడికి ఎర్రని పుష్పాలు అంటే ఎంతో ప్రీతికరం అందుకే వినాయక చవితి పండుగ రోజు స్వామివారికి ఎర్రని పుష్పాలతో పూజించడం వల్ల ఎంతో ప్రతి చెందుతారు. ఇలాంటి పుష్పాలతో పూజ చేయకపోతే వినాయకుడి పూజ అసంపూర్ణం అవుతుంది. ఇక వినాయకుడికి సింధూరం అంటే కూడా ఎంతో ఇష్టం కనుక సింధూరం పెట్టడం ముఖ్యం అలాగే అరటి పనులను కూడా నైవేద్యంగా సమర్పించాలి. వీటితోపాటు వెలగ పండు కూడా స్వామి వారి పూజలు తప్పనిసరిగా ఉండాలి. వీటన్నింటిని సమర్పించి పూజ చేసినప్పుడే వినాయకుడి పూజ సంపూర్ణం అవుతుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.