Yawning: సాధారణంగా మనం ఉదయం నిద్ర లేవగానే లేదా రాత్రి పడుకోవడానికి ముందు పెద్ద ఎత్తున ఆవలింతలు రావడం అనేది సాధారణంగా కనిపించే శారీరక చర్య. నిద్రలేమి, అలసట, బోర్‌గా అనిపించడం, ఒత్తిడి లేదా ఎక్కువసేపు విశ్రాంతి లేకపోవడం వంటి కారణాలతో తరచుగా ఆవలింతలు రావచ్చు. ఇలా ఆవలింతలు ఎక్కువగా వస్తే ఏదైనా ఆరోగ్యానికి గురి అయినట్టేనా? ఆవలింతలు ఎక్కువగా రావడం వల్ల గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఉందా అంటూ చాలామంది సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగానే ఆవలింతలు వస్తే గుండె జబ్బు వస్తుందా అనే విషయానికి వస్తే..
సాధారణంగా ఆవలింతలు రావడం ఒక్కటే గుండె జబ్బు వస్తుందనే సంకేతం కాదు.అయితే, కారణం తెలియకుండా అతి ఎక్కువగా ఆవలింతలు రావడం మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. కొన్ని సందర్భాల్లో అధిక పగటి నిద్ర, నిద్రలేమి లేదా స్లీప్ అప్నియా వంటి నిద్ర సంబంధిత సమస్యలతో ఆవలింతలు ఎక్కువగా ఉండవచ్చు. నిద్ర నాణ్యత సరిగా లేకపోవడం గుండె ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ పేర్కొంటోంది.ఆవలింతలతోపాటు
ఛాతిలో నొప్పి లేదా బిగుతు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చెమటలు పట్టడం, తల తిరగడం, వికారం లేదా శరీరంలోని పైభాగంలో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం ఏమాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్ ను సంప్రదించాలి. ఆవలింతలతోపాటు ఈ లక్షణాలు మీలో ఉన్నాయి అంటే మీ గుండె ప్రమాదంలో ఉన్నట్టే.
ఇక తరచూ ఆవలింతలు ఎక్కువగా వస్తున్నప్పుడు.. ప్రతిరోజూ తగినంత నిద్ర పొందుతున్నారా అనేది గమనించండి. రోజులు మీకు శారీరక అలసట, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉందా అనే విషయాలను గమనించుకోవాలి అలాగే కొత్తగా ఏదైనా మందులు వాడుతున్నారా, పగటిపూట నిద్రమత్తు ఉంటుందా అనే విషయాలన్నింటినీ గమనించుకోవాలి. ఇలా మన శరీరం ఇచ్చే ఈ సంకేతాలను గుర్తించి పై పేర్కొన్న లక్షణాలు ఉంటే కనుక ఆందోళన చెందకుండా వెంటనే డాక్టర్ ను సంప్రదించడం మంచిది.
Sai Gangula: న్యూజెర్సీలోని తెలుగు సమాజానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. నాట్స్ న్యూజెర్సీ…
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
This website uses cookies.