Categories: Health

చేపలు తింటే ఇన్ని ప్రయోజనాలా..? సైన్స్ చెబుతున్న సత్యాలు ఇవే

గజిబిజి పరుగుల జీవితం. హాయిగా నచ్చిన ఆహారాన్ని వండుకుని తినే పరిస్థితి కూడా లేదు. రోడ్డుమీద ఏది పడితే అది తింటూ ఆరోగ్యాన్ని మనచేతులారా పాడు చేసుకుంటున్నాము. పోషకాల ఆహారం గురించి తెలిసినా పొట్ట నిండా తింటే తిప్పలు తవ్వవేమోనని భయపడుతుంటాము. చికెన్ , మటన్ తప్పితే మరో ఆహారం వైపు ఈ మధ్యకాలంలో దృష్టి వెళ్లడం లేదు. నిజానికి సీ ఫుడ్ అందులోనూ చేపలను ఆహారంగా నిత్యం తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని సైన్స్ చెబుతోంది. డైట్‌లో ఎక్కువగా చేపలను ఆహారంగా తీసుకోవడం వల్ల లీన్ ప్రోటీన్‌తో పాటు ఒమేగా 3 ఫ్యాట్స్‌తో పాటు మరిన్ని పోషకాలను శరీరానికి అందించవచ్చునని వైద్యులు పేర్కొంటున్నారు. మరి ప్రతి రోజు ఎంత మోతాదులో చేపలు తినాలి? చేపలను మాత్రమే ఎంజాయ్ చేస్తూ ఎందుకు తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.

అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నిపుణులు ప్రతి వారం రెండు సార్లు 100 గ్రాముల వండిన చేపలను తినాలని సిఫార్సు చేస్తున్నారు. అంటే మీ గుప్పిట్లో పట్టేంత వండిన చేపలను తీసుకోవాలిని సూచిస్తున్నారు. ఇంట్లో వండుకుంటున్నట్లైతే మీ అరచేయి కన్నా కొంచెం పెద్దగా ఉన్న చేప ముక్కను తీసుకుని వంటకం సిద్ధం చేసుకోవాలని చెబుతున్నారు. ఒక వేళ బయట భోజనం చేస్తున్నట్లైతే చాలా వరకు రెస్టారెంట్‌లలో ఒకే సిట్టింగ్‌లో మనకు కావాల్సిన దానికన్నా కొన్ని రెట్లు పెద్ద చేప ముక్కలను అందిస్తుంటాయి. కాబట్టి జాగ్రత్తగా అడి మరీ వడ్డించుకోవాల్సిందే.

ఈ మూడు కారణాల వల్లనే చేపలను ఎక్కువగా తినాలని సూచిస్తున్నారు వైద్యులు. ఇండియాలో కోస్తా తీరంలో మాత్రమే ఎక్కువగా చేపలు లభిస్తాయి. మిగతా ప్రాంతాల్లో పెద్దగా ఉండవు. అందుకే చికెన్ మటన్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. నార్త్‌లో చాలా మంది కి వెజ్ తినే అలవాటు ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో చాలా మంది సీఫుడ్‌ను తినడానికి ఇష్టపడతారు. అయితే ప్రతి రోజు చేపలను తినరు వారానికి ఒకసారి మాత్రమే తింటారు. కానీ చేపలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మూడు రకాలుగా ప్రయోజనాలు ఉన్నాయి .

చేపలు మానవ శరీర బరువును తగ్గిస్తాయి:
చేపల్లో ఉండే లీన్ ప్రోటీన్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఫిష్ తినగానే సంతృప్తిగా తిన్నామన్న అనుభూతి కలుగుతుంది. మరీ ముఖ్యంగా ఆకలిని తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు ఈ ప్రోటీన్ ఫుడ్‌ను తీసుకుని స్ట్రాంగ్‌గా ,సన్నగా తయారవ్వొచ్చు. ప్రతి సీ ఫుడ్ లో 20 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అందులోనూ తెల్ల చేపల్లో లీన్ ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇందులో చాలా తక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది. సాల్మన్, సీబాస్‌, వంటి ఫ్యాటీ ఫిష్‌లు కూడా మన శరీరానికి మంచి ఫ్యాట్స్‌ను అందిస్తాయి. ఇతర మాంసాహారంతో పోలిస్తే సీఫుడ్‌లో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది..

గుండె ఆరోగ్యానికి మంచి చేస్తుంది:
చేపలు, సముద్రపు ఆహార ఉత్పత్తుల్లో ఒమేగా 3 ఫ్యాట్‌ పుష్కలంగా లభిస్తుంది. ఇవి దీర్ఘకాలంలో గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. వారానికి రెండు నుంచి మూడు సార్లు చేపలను తినడం వల్ల గుండె జబ్బులతో గలిగే మరణాల సంఖ్య 36 శాతం తగ్గిందని పరిశోధనలు చెబుతున్నాయి. ఒమేగా 3 ఫ్యాట్స్‌ గుండెలో వాపును తగ్గించి రక్తనాళాల ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడుతుంది.

మెదడు అభివృద్ధికి తోడ్పడుతుంది:
ఒమేగా 3 ఫ్యాట్స్‌లో రెండు రకాలు ఉన్నాయి. EPA మరియు DHA. ఇందులో DHA బ్రెయిన్ నర్వర్స్ సిస్టమ్‌ అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తుంది.
12వేల మంది గర్భినీ స్త్రీలపై జరిపిన అధ్యయనంలో వారానికి రెండు సార్లు కంటే తక్కువగా చేపలు తినే తల్లులకు పుట్టిన పిల్లల మేథస్సు, ప్రవర్తనతో పాటు పరీక్షల్లో అంతగా రాణించలేదని కనుక్కున్నారు. షార్క్, స్వార్డ్ ఫిష్, కింగ్ ఫిష్ , టూనా వంటి ఎక్కువ మెర్క్యురీ కలిగిన చేపలను తీసుకోకూడదని సూచిస్తున్నారు.

Editor Sr

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

1 day ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

1 day ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

3 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

4 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

4 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

5 days ago

This website uses cookies.