South Cinema: సినిమా అనేది కూడా ప్రస్తుతం రాజకీయాలలో ఒక భాగంగా మారిపోయింది. అందుకే మన సౌత్ సినిమాలని కనీసం నేషనల్ అవార్డులకి కూడా ఎంపిక చేయడం చాలా అరుదుగా ఉంటుంది. మనవాళ్ళు ఎంత గొప్ప సినిమాలు చేసిన కూడా మొదటి నుంచి ఓ రకమైన చిన్న చూపు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సినిమా అవార్డుల విషయంలో ఎప్పుడూ కూడా మనకి అన్యాయం జరుగుతూనే ఉంటుంది అనేది చాలా మంది సౌత్ సినీ ప్రేమికులు చెప్పే మాట. అలాగే ఈ సారి ఆస్కార్ నామినేషన్ల విషయంలో కూడా సౌత్ సినిమాకి అన్యాయం జరిగిన సంగతి తెలిసిందే. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆర్ఆర్ఆర్ సినిమాని ఇండియా నుంచి ఆస్కార్ నామినేషన్స్ కి అస్సలు కన్సిడర్ చేయలేదు.
కమర్షియల్ మూవీ అనే కోణంలో ఆర్ఆర్ఆర్ సినిమాని పక్కన పెట్టింది. అదే సమయంలో కేంద్రంలో బీజేపీ పార్టీని మెప్పించడానికి గుజరాత్ సినిమాని ఆస్కార్ నామినేషన్లుకి ఇండియా నుంచి పంపించింది. చల్లో షో అనే ఒక డాక్యుమెంటరీ తరహా సినిమాని ఆస్కార్ ఇండియన్ నామినేషన్ గా పంపించడంపై అప్పట్లో సర్వత్రా విమర్శలు వ్యక్తం అయ్యాయి. అయితే దానికి ఫిల్మ్ ఫెడరేషన్ అస్సలు సమాధానం చెప్పలేదు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఇండియా నుంచి ఆస్కార్ అవార్డుని గెలుచుకుంది. దీంతో మరోసారి నార్త్ ఇండియా ఆధిపత్యంతో నడిచే ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మీద విమర్శలు వస్తున్నాయి.
మీరు తిరస్కరించిన ఆర్ఆర్ఆర్ సినిమాకి ఇప్పుడు ఆస్కార్ అవార్డు వచ్చింది అని ట్విట్టర్ లో పోస్టులు పెడుతున్నారు. దీంతో సౌత్ ఇండియా సినిమాలపై ఎంత చిన్న చూపు ఉందనేది దీంతో మరోసారి ప్రూవ్ అయ్యిందని పోస్టులు పెడుతున్నారు. ఇక బీజేపీ ప్రభుత్వాన్ని కూడా కొంత మంది సౌత్ రాజకీయ నాయకులు విమర్శలు చేస్తూ ఉండటం విశేషం. విశేషం ఏంటంటే ఈ సారి ఆస్కార్ అవార్డు గెలుచుకున్న రెండు సినిమాలు కూడా సౌత్ నుంచి వెళ్లినావే. ఆర్ఆర్ఆర్ మూవీ తెలుగు సినిమా అయితే, ది ఎలిఫెంట్ విష్పరర్స్ మూవీ తమిళనాడు బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. అలాగే గతంలో కూడా రెండు ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న ఎఆర్ రెహమాన్ తమిళ్ వ్యక్తి కావడం విశేషం. ఆస్కార్ లో ఇండియా గౌరవాన్ని నిలబెట్టిన సినిమాలు సౌత్ నుంచి రావడం విశేషం. అయితే కూడా సౌత్ సినిమాలపై ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చిన్న చూపు ఇంకెంత కాలం ఉంటుంది అనేది చూడాలి.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.