Categories: Health

Health Care:రోజు 8 గంటలు నిద్రపోయినా నీరసంగా ఉందా? కారణం ఇదే తెలుసా?

Health care: మనం ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే సరైన తిండితో పాటు నిద్ర కూడా ఎంతో అవసరం. సరైన నిద్ర లేకపోతే ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని చెప్పాలి. అందుకే ప్రతిరోజు 8 గంటల నిద్ర తప్పనిసరి అని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాలలో మనం రాత్రిపూట 7-8 గంటల పాటు నిద్రపోయిన ఉదయం లేవగానే చాలా అలసటగా నీరసంగా ఉంటుంది మరి కొంతమందిలో పనిమీద శ్రద్ధ లేకపోవడం తీవ్రమైన తలనొప్పి వంటి సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. ఇలా మన శరీరానికి సరిపడా నిద్ర ఉన్నప్పటికీ ఇలాంటి అలసట నీరసం రావడానికి గల కారణాలు ఏంటి అనే విషయానికి వస్తే..

మనం 7-8 గంటలపాటు నిద్రపోయినప్పటికీ ఇలాంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణం మన నిద్ర సమయంలో మార్పులు చోటు చేసుకోవడమేనని నిపుణులు చెబుతున్నారు. మనం ఎన్ని గంటలు నిద్రపోతున్నాము అనే దానితోపాటు ఏ సమయంలో పడుకొని ఎప్పుడు లేస్తున్నాము అనేది కూడా కీలకమైనని చెబుతున్నారు. వారంలో ప్రతిరోజు రాత్రి10కి పడుకుని ఉదయం 6కు లేవడం వల్ల మన శరీరం అలవాటు పడి ఉంటుంది అయితే ఉన్నఫలంగా వారాంతంలో రాత్రి ఆలస్యంగా పడుకొని ఉదయం ఆలస్యంగా లేయటం వల్ల శరీరంలోని సహజ జీవ గడియారం పై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ఈ పరిస్థితిని సాధారణంగా ‘సోషల్‌ జెట్‌ లాగ్‌’ అని పిలుస్తారు.

Feeling tired after 8 hours sleep know the reason

నిద్ర సమయాలలో మార్పులు..

నిద్రపోయే సమయం తరచూ మారిపోతే శరీరంలోని సహజ నిద్ర చక్రం గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఇలా ఆలస్యంగా పడుకొని ఆలస్యంగా నిద్రలేవటం వల్ల ఉదయం లేవగానే పూర్తి విశ్రాంతి లభించలేదనే భావన కలగవచ్చు. దీంతో కొంతమందిలో ఉదయం అలసట, నిద్రమత్తు, నీరసం, ఏకాగ్రత తగ్గడం, శక్తి లేనట్లు అనిపించడం, తలనొప్పి వంటి సమస్యలు ఉంటాయి. ఇలాంటి సమస్యల నుంచి మనం బయటపడాలి అంటే ప్రతిరోజు ఒకే సమయంలో నిద్రపోయి ఒకే సమయంలో నిద్ర లేవడం అలవాటుగా చేసుకోవాలి అప్పుడే సరైన నిద్రతో పాటు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచుకోవచ్చు.

Sravani

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 weeks ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

2 weeks ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

1 month ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 month ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 month ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.