Technology: ట్విట్టర్‌కు కొత్త బాస్‌గా బాధ్యతలను చేపట్టిన వెంటనే హుటా హుటిన 3వేలకు పైగా మంది ఉద్యోగులను విధుల్లోంచి తొలగించి ఇంటికి సాగనంపాడు ఎలాన్ మస్క్. అయితే అది పెద్ద తప్పని తెలుసుకున్నాడు కాబోలు వెంటనే దిద్దుబాటు చర్యలను మొదలుపెట్టాడు. ఉద్యోగుల తొలగింపు తరువాత ఏర్పడిన గందోరగోళ పరిస్థితులను చక్కదిద్దేందుకోసం తొలగించిన వారిలో కొంత మంది ఉద్యోగులను తిరిగి రావాలని ఎలాన్ వేడుకుంటున్నాడట.
ట్విట్టర్‌లో ఏకంగా 3,700 మంది ఉద్యోగులను తొలగించిన ఎలోన్ మస్క్, నిర్ణయాలు తీసుకునే విషయంలో తాను తప్పటడుగు వేస్తాడని మరోసారి నిరూపించాడు. శుక్రవారం చాలా మంది ట్విటర్ ఉద్యోగులు కంపెనీకి చెందిన వివిధ వెబ్‌సైట్‌ల నుండి మస్క్ యొక్క ట్విట్టర్ లేఆఫ్ ప్లాన్‌లో భాగంగా వారి ఉపాధిని రద్దు చేసినట్లు తెలుసుకున్నారు. అయితే ఆ తరువాత, ఆశ్చర్యకరమైన మలుపులో భాగంగా డజన్ల కొద్దీ ట్విట్టర్ ఉద్యోగులు పొరపాటున తొలగించబడ్డారని, ఈమెయిల్స్ విషయంలో కొన్ని తప్పులు దొర్లాయని , మస్క్ యొక్క కొత్త ట్విటర్ ప్లాన్‌ల అమలు కోసం మీ సేవలు అవసరం అని కొంత మంది ఉద్యోగులకు మరోసారి మెయిల్స్ పంపించినట్లు తెలుస్తోంది.
ట్విట్టర్‌ను సోషల్ మీడియాలో టాప్ ప్లేస్‌లో నిలబెట్టాలని భారీ ప్లాన్‌లు వేస్తున్నాడు ఎలాన్. ఇప్పటికే ప్రత్యేక ప్రణాళికను తయారు చేసినట్లు తెలుస్తోంది. అయితే తన ప్లాన్స్ సవ్యంగా సాగాలంటే నిపుణులైన ఎంప్లాయిస్ అవసరం. అయితే ఎలాన్ తొలగించిన ఉద్యోగుల్లో నైపుణ్యత కలిగినవారు లేకపోలేదు. ఈ క్రమంలో వారి సహాయం తన అప్‌కమింగ్ ప్లాన్స్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు చాలా అవసరం. అందుకే మెయిల్స్ ద్వారా ఎంప్లాయిస్‌ను తిరిగి విధుల్లోకి రమ్మన్నారని టాక్ వినిపిస్తోంది. అయితే ఎంత మంది తిరిగి విధుల్లోకి తిరిగి వస్తారు అన్నది ఇప్పటికీ క్వశ్చన్ మార్క్. అసలు వారినే పిలుస్తారా? లేదా కొత్తవారిని తీసుకుంటారా అనే విషయంపైన ఎలాంటి క్లారిటీ లేదు. ఈ విషయం తెలియాలంటే ఎలాన్ మస్క్ తన నిర‌్ణయాన్ని ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.
Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ జీనియస్ శంకర్ షణ్ముగ్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘గేమ్ ఛేంజర్’.…
Tollywood Exclusive: 2000 సంవత్సరం తర్వాత నటుడు, నిర్మాత అశోక్ కుమార్ తన బ్యానర్ లో ఒక సినిమాకు శ్రీకారం…
The Rana Daggubati Show Trailer: త్వరలో పాపులర్ ఓటీటీ అమెజాన్ ప్రైం లో టాలీవుడ్ టాల్ హీరో అయిన…
Bhagyashri Borse: తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. మాస్ మహారాజా రవితేజ-డైరెక్టర్ హరీశ్ శంకర్…
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
This website uses cookies.