Solar Eclipse: మారుతున్న కాలంతో పాటు ప్రపంచంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నా యి. విజ్ఞానంలో సరికొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి. టెక్నాలజీలో కొత్త పుంతలు తొక్కుతున్న నేపధ్యంలో అనాదిగా వస్తున్న మూఢ విశ్వాసాలకి కూడా ముగింపు పలకాల్సిన అవసరం ఉంది. అయితే భారతదేశంలో మాత్రం ఇప్పటికి మత విశ్వాసాలని ఆచరించే వారు ఎక్కువ అయ్యారు. అలాగే ఈ మధ్యకాలంలో అయితే ప్రాచీన నాగరికత, విజ్ఞానం అంటూ సైన్స్ కి, జ్యోతిష్యానికి సంబంధం కలిపేసి చెబుతున్నారు. సూర్యగ్రహణం సమయంలో అసలు ఎలాంటి పనులు చేయకూడద ని జ్యోతిష్య పండితులు చెబుతూ ఉంటారు. అయితే సైన్స్ లో ఎక్కడా కూడా అలాంటి విషయాలని ప్రస్తావించలేదు.
ఇప్పటికే సూర్యగ్రహణం సమయంలో వెలువడే కాంతి కిరణాలతో ఏమైనా ప్రమాదకర కారకాలు ఉన్నాయా అనే విషయాలని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా సూర్య గ్రహణం రోజున ఇండియాలో ప్రధాన నగరాలన్నీ రెండు గంటల పాటు పూర్తిగా మూగబోయాయి అని చెప్పాలి. రోజువారీ గా జరిగే కార్యకలాపాలు అన్ని కూడా ఈ సూర్యగ్రహణం పడిన సమయంలో పూర్తి గా మందగించాయి. వ్యాపారులు వారి వ్యాపారాలని కూడా ఆపేసారు. హిందుత్వాన్ని, భారతీయ సనాతన ధార్మిక విశ్వాసాల్ని ఇప్పటికి నమ్మే ప్రజలు పూర్తిగా ఇంటికే పరిమితం అయిపోయారు.
దీంతో ప్రధాన నగరాలలో రహదారులు అన్ని నిర్మానుష్యంగా మారిపోయాయి. ఎక్కడో ఒకటి, అర అనే విధంగా వాహనాలు, మనుషులు కనిపించారు. పూర్తిగా రోడ్లు ఖాళీ అయిపోవడంతో మళ్ళీ కరోనా లాక్ డౌన్ సమయంలో ఉన్నట్లు అనిపించింది. అయితే కొంత మంది మాత్రం సూర్య గ్రహణం సమయంలో జ్యోతిష్యం చెప్పే విషయాలు అన్ని కూడా కేవలం మూఢ నమ్మకాలు అంటూ విజ్ఞాన శాస్త్రాన్ని విశ్వసించే వారు నిరూపించే ప్రయత్నం చేశారు. గ్రహణం పడిన సమయంలోనే రోడ్డుపై భోజనాలు చేస్తూ ప్రజలకి అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. అయితే ఎన్ని చేసిన దైవం ఉందని విశ్వసించినంత కాలం ఈ గ్రహణం సమయంలో పెట్టె నియమాలని కూడా ప్రజలు కచ్చితంగా పాటిస్తారు అనేది మరోసారి రుజువైంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.