Categories: Tips

Spirtual: దెయ్యాలు నిర్మించిన దేవాలయం ఎక్కడ ఉందో తెలుసా

Spiritual: భారతదేశంలో ఎన్నో మహిమాన్వితమైన దేవాలయాలు ఉన్నాయి. వాటి వెనుక ఎన్నో వేల ఏళ్ళ చరిత్ర కూడా ఉంది. దేవాది దేవతలు ఆలయాలు వేల సంఖ్యలో మన భారత ఖండంలో ఉన్నాయి. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం నుంచి పూజలందుకుంటున్న ఆలయాలు కూడా కోకొల్లలుగా ఉన్నాయి. శైవ సాంప్రదాయంలో శివాలయాలు, మహాశక్తి ఆలయాలు, వైష్ణవ సాంప్రదాయంలో మహావిష్ణు అవతారాలకు సంబంధించిన ఆలయాలు పూజలు అందుకుంటున్నాయి.

సాక్షాత్తు దేవతలు కట్టించిన ఆలయాలు కూడా ఇందులో ఉన్నాయి. అలాగే రాక్షసులు నిర్మించిన ఆలయాలు కూడా ఉన్నాయి. కొన్ని ఆలయాలు అయితే గ్రహాంతరవాసులు నిర్మించారని కూడా కథలుగా చెప్పుకునే వారు ఉన్నారు. ఇదిలా ఉంటే దెయ్యాలు నిర్మించిన దేవాలయం కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఈ మహాదేవుడి ఆలయంలో శివుడు సుందరేశ్వరుడుగా పిలవబడుతున్నారు. కర్ణాటకలో బెంగళూరు సమీపంలో బొమ్మవర అనే గ్రామంలో ఈ సుందరేశ్వర ఆలయం ఉండటం విశేషం.

do you know the temple constructed by demons

పూర్వకాలంలో ఆ గ్రామంలో దెయ్యాల సంచారం ఎక్కువగా ఉండేది. దీంతో గ్రామస్తులు ఆలోచించి శివాలయం నిర్మిస్తే దెయ్యాలు పారిపోతాయని భావించి ఆలయం నిర్మించడానికి సిద్ధమయ్యారు. అయితే ఈ ఆలయ నిర్మాణంలో దెయ్యాలు అవాంతరం సృష్టించి పూర్తికాకుండా అడ్డుపడేవి. దీంతో గ్రామస్తులు ఒక మాంత్రికుని ఆశ్రయించారు. మాంత్రికుడు కాళికా ఉపాసన చేసి అన్ని దెయ్యాలను బంధించాడు. దీంతో దెయ్యాలు దారికి వచ్చి తమను విడిచి పెట్టాలని కోరుకున్నాయి. అయితే ఆలయాన్ని నిర్మిస్తే విడిచి పెడతానని మాంత్రికుడు కండిషన్ పెట్టడంతో దెయ్యాలు తప్పనిసరి పరిస్థితుల్లో ఆలయ నిర్మాణాన్ని చేపట్టి అక్కడ్నుంచి వెళ్ళిపోయాయి.

కొంతకాలం పాటు ఆలయంలో గ్రామస్తులు ఎలాంటి శివలింగాన్ని ప్రతిష్టించి లేదు. తర్వాత ఆలయ సమీపంలో ఉన్న ఒక మంచి నీళ్ల బావిలో శివలింగం వారికి కనిపించింది. దాన్ని తీసుకొచ్చి ఆలయంలో ప్రతిష్టించారు. అప్పటి నుంచి సుందరేశ్వరుడుకి ఆ ఆలయంలో నిత్య పూజలు జరుగుతున్నాయి. ఇక భూతాలు నిర్మించిన ఆలయం కావడంతో ఆ టెంపుల్ గోడలపై దెయ్యాల విగ్రహాలు కనిపిస్తాయి. అన్ని ఆలయాల కంటే  విచిత్రంగా ఈ ఆలయం ఉండడం విశేషం. ఈ ఆలయంలో మహా దేవుని భూతనాథుడుగా కూడా అక్కడి వారు కొలుస్తారు. ఎవరికైనా దెయ్యాలు పడితే ఈ ఆలయానికి తీసుకొస్తే వదిలేస్తాయి అని స్థానికుల నమ్మకం.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Virinchi Varma: ‘జితేందర్ రెడ్డి’ సినిమా అందుకే చేశాను..

Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…

5 days ago

Raashii Khanna: అది నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..?

Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…

2 weeks ago

Tollywood: కాంబో ఫిక్స్..కానీ కథే కుదరలా..?

Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…

2 weeks ago

SSMB29: జనవరి నుంచి వచేస్తున్నాం..

SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…

2 weeks ago

The Raja Saab: ప్రభాస్ లుక్ చూస్తే రజినీకాంత్ గుర్తొస్తున్నారా..?

The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…

2 weeks ago

Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ..

Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…

2 weeks ago

This website uses cookies.