Categories: Tips

Health: క్యారెట్ తో కాలుష్యాన్ని దూరం చేయ్యొచ్చు… ఎలానో తెలుసా?

Health: సాధారాణంగా మనం కొన్ని వంటకాలలో క్యారెట్‌ను ఎక్కువగా వాడుతుంటాము. అంతేకాదు, ఉదయం క్యారెట్ జ్యూస్ త్రాగేవారూ ఎక్కువశాతమే ఉన్నారు. కానీ, కొందరు క్యారెట్ వల్ల పొందే లాభాలను మాత్రం అంతగా తెలుసుకోలేరు. సరదాగా క్యారెట్ తినేవారూ కొందరున్నారు. అయితే, అలాంటి వారూ చాలా లాభాలనే పొందుతున్నారు. చిన్నతనం నుంచి క్యారెట్ తింటే బ్లడ్ బాగా శరీరంలో ఉత్పత్తి అవుతుందని చెబుతుంటారు. కంటి చూపుకి కూడా ఇది మేలు చేస్తుంది. మరి క్యారెట్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవి మాత్రమేనా అంటే కాదు. ఇంకా చాలానే ఉన్నాయి.

వాతావరణంలో వస్తున్న మార్పులతో కాలుష్యం ప్రతి రోజు పెరిగిపోతూనే ఉంది. ముఖ్యంగా వాయు కాలుష్యం ప్రపంచంలో ప్రమాదకర స్థాయిలోఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాహనాల వినియోగం పెరిగిపోవడంతో, పారిశ్రామికీకరణ కారణంగా గాలిలోకి వెదజల్లే ప్రమాదకర వాయువులు మొత్తం పొల్యూట్ చేస్తున్నాయి. ఈ కాలుష్యం కారణంగా ప్రజలు ఎన్నో రోగాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా పట్టణాలలో ఉండే ప్రజలు అయితే అత్యంత ప్రమాదకరమైన వాతావరణంలో జీవిస్తున్నారు.

భారత్ లో అయితే ఈ వాయుకాలుష్యం తీవ్రత గత రెండు దశాబ్దాల కంటే రెండున్నర రెట్లు పెరిగిందని పరిశోధనలు తెలుపుతున్నాయి. ఇక ఏటా ఈ వాయుకాలుష్యం కారణంగా 70 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా తెలియజేసింది. ఇక వాయు కాలుష్యం కారణంగా వాతావరణంలో కూడా ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వేసవి ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. అలాగే తుఫాన్ ల ప్రభావం పెరిగింది. చలి తీవ్రత కూడా ప్రమాదకర స్థాయిలో మైనస్ డిగ్రీలకి పడిపోతుంది.

do you know how carrot controls pollution

అలాగే సీజన్ తో సంబంధం లేకుండా ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక ఈ వాయు కాలుష్యం కారణంగా ఉదయం బయటకి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చే సరికి ఎన్నో ప్రమాదకర ధాతువులు ఒంటిపైకి, శరీరంలోకి చేరుతున్నాయి. కొంత మంది ఈ కాలుష్యంలోనే ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఈ కారణంగా రకరకాల రోగాల బారిన పడుతూ తక్కువ వయస్సులోనే మృత్యువాత పడుతున్నారు. అలాగే క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఊపిరితీత్తుల సమస్యతో సతమతం అవుతున్నారు. అయితే ఈ వాయుకాలుష్యంతో ప్రమాదక కార వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే మన ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని డాక్టర్లు కూడా సూచిస్తున్నారు.

ముఖ్యంగా ప్రతి రోజు క్యారెట్, కొత్తిమీర తింటే శరీరంలో కాలుష్య కారకాలని బయటకి పంపిస్తాయి. ఇవి శరీరంలో కాలుష్య కారకాలని బయటకి పంపడటంలో ఎంతో ప్రభావవంతంగా పని చేస్తున్నాయని అమెరికాలో డెలావర్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ప్రయోగాత్మకంగా నిరూపించారు. ఇప్పటికే చాలా మంది తమ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకొని ఆరోగ్యకరమైన ఆహార పదార్ధాలు తీసుకోవడం మొదలు పెట్టారు. అయితే సేంద్రీయ పద్ధతిలో పండించే ఆహార పదార్ధాలని మాత్రమే తీసుకుంటే ప్రయోజనం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్న మాట.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

PURANAPANDA SRINIVAS : పురాణపండకు త్యాగరాయ గానసభలో దక్కిన ఘనత!

PURANAPANDA SRINIVAS : జంట నగరాలుగా భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో సుమారు ఆరు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర…

2 weeks ago

Ram Charan: ఊహించని రేంజ్‌లో ‘పెద్ది’ ఫస్ట్ షాట్..’పుష్ప’ రికార్డ్స్ బద్దలు..!

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా 'పెద్ది'. శ్రీరామనవమి పండుగ సందర్భంగా…

3 weeks ago

Sreeleela: డార్జిలింగ్‌ లో యంగ్ హీరోయిన్‌కి చేదు అనుభవం..

Sreeleela: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీలకు షూటింగ్ సమయంలో ఒక చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల ఆమె షూట్‌ ముగిసిన…

3 weeks ago

Nagababu : శ్రీరామచంద్రుని ‘ జయ జయ రామ ‘ ఆవిష్కరించడం అదృష్టం.

Nagababu : శ్రీరామచంద్రుడన్నా , ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…

3 weeks ago

Tollywood : రీ రిలీజ్‌లో ‘సలార్‌’తో నాని సినిమా పోటీ

Tollywood : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ మూవీ 'సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్'.…

1 month ago

Tollywood : వైరల్ ప్రపంచం మూవీ రివ్యూ

Tollywood : డిజిట‌ల్ యుగంలో మ‌న‌కు ఎన్ని సౌక‌ర్యాలు అందుతున్నాయో అన్నీ స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి. టెక్నాల‌జీని స‌రిగ్గా వాడుకోక‌పోతే ఒక్కోసారి…

2 months ago