Sravana Masam: తెలుగు వారికి ఎంతో పవిత్రమైన మాసాలలో శ్రావణమాసం ఒకటి. శ్రావణ మాసంలో పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నోములు వ్రతాలు చేసుకుంటూ ఉంటారు అలాగే దానధర్మాలకు కూడా శ్రావణమాసం ఎంతో మంచిదని భావిస్తూ ఉంటారు. శ్రావణ సోమవారం శివుడికి ప్రత్యేకంగా పూజలు చేయడం మంగళవారం గౌరీ వ్రతం వరలక్ష్మీ వ్రతం వంటివి నిర్వహిస్తూ ఉంటారు. అయితే శ్రావణమాసంలో వచ్చే శనివారం మనం కనుక ఇలాంటి పని చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆ అదృష్టం మీ వెంటే ఉంటుందని పండితులు చెబుతున్నారు.
మరి శ్రావణ శనివారం అదృష్టం కలగడం కోసం ఎలాంటి పనులు చేయాలి అనే విషయానికి వస్తే… ఈ మాసంలో లక్ష్మీనారాయణనుడిని పూజించడం వల్ల సకల సౌభాగ్యాలు కలుగుతాయని భావిస్తారు. ఇక శ్రావణమాసంలో వచ్చే శనివారంలో గోమాతను పూజించాలి గోమాతల సకల దేవతలు కొలువై ఉంటారని భావిస్తారు కనుక గోపూజ ఎంతో ముఖ్యమైనది. అదేవిధంగా శనివారం దానధర్మాలకు కూడా ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు.
శనివారం మన స్తోమతను బట్టి పేదలకు వస్త్ర దానం, అన్నదానం చేయాలి అదేవిధంగా నవధాన్యాలను సైతం దానం చేయాలి. ఇక నల్లని దుస్తులతో పాటు నల్లటి నువ్వులు ఇతర నల్ల వస్తువులను శనివారం రోజు దానం చేయటం వల్ల శనీశ్వరుని దోషాలు తొలగిపోతాయి. అయితే శనివారం పొరపాటున కూడా ఇనుము, ఉప్పు, కొత్త చెప్పులు, నూనె, నల్లని బట్టలు వంటివి ఇంటికి తెచ్చుకోకూడదు. ఇలా చేయటం వల్ల మనకు ఉన్నటువంటి అష్ట దరిద్రాలు తొలగిపోయి సకల సంపదలు కలుగుతాయి.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.