Health: మన ఆహారపు అలవాట్లు మన ఆరోగ్యాన్ని, మన జీవన ప్రమాణాలని నిర్ణయిస్తాయనే విషయం చాలా మంది గ్రహించరు. అందుకే ఆహారం విషయంలో సరైన నియమాలు పాటించకుండా, సమయాన్ని ఫాలో అవ్వకుండా సందర్భం లేకుండా తింటూ ఉంటారు. ఇలా ఆహారం క్రమం రోజువారి ఫుడ్ సైకిల్ పాటించకుండా తినడం వలన తీవ్రమైన అనారోగ్యాల బారిన పడటమే కాకుండా స్థూలకాయం, నిద్రలేమి, ఎసిడిటీ, ఉబకాయం, షుగర్స్, బీపీ వంటి అనారోగ్యాల బారిన చిన్న వయస్సులోనే పడుతున్నారు. ఇక ఒక్కసారి శరీరంలో జీర్ణక్రియ దెబ్బతింటే తరువాత ఎన్ని రకాల వ్యాయామాలు చేసిన, మెడిసన్ వాడిన కూడా ప్రయోజనం ఉండదని వైద్యులు చెబుతున్నారు.
ఇక ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆహారపు అలవాట్ల విషయంలో, రోజువారి వ్యాపకాలలో కచ్చితమైన టైంని ఫాలో అవుతూ ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. పండ్ల పదార్ధాలు తినడం వలన ఎంతో శ్రేయస్కరం అని డాక్టర్లు సూచిస్తూ ఉంటారు. అయితే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండే పండ్లని రాత్రి సమయాలలో ఎక్కువగా తీసుకోకూడదు అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి నిద్రపోయే సమయంలో ఆహారపు అలవాట్ల విషయంలో కచ్చితమైన మార్పులు చేసుకోవాలని చెబుతున్నారు. అసలు రాత్రి తీసుకోకూడని ఆహారాలు కొన్ని ఉన్నాయని, వీలైనంత వరకు వాటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. మాంసాహారంలో ప్రోటీన్, కొవ్వు పదార్ధాలు ఎక్కువగా ఉంటాయి. అవి అంత వేగంగా జీర్ణం కావు. రాత్రి సమయాలలో మాంసాహారం తీసుకోవడం వలన జీర్ణక్రియ మందగించే అవకాశం ఉంది. ఈ కారణంగా కడుపు ఉబ్బరంగా ఉండి, సరిగా నిద్ర పట్టదు.
అలాగే ఐస్ క్రీమ్, చీజ్ పిజ్జ ఫ్రైడ్ ఫుడ్స్ కి వీలైనంత దూరంగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు. వీటికి అరుగుదల సామర్ధ్యం తక్కువగా ఉండటం వలన అంత వేగంగా జీర్ణం కావు. వీటి కారణంగా శరీరంలో అనవసరమైన కొవ్వు పెరిగిపోయి బరువు పెరిగిపోతారు. అలాగే రాత్రి సమయాలలో అరటిపండు అస్సలు తినకూడదు. అరటిపండు కారణంగా ఊపిరితీత్తులలో శ్లేష్మం పెరిగిపోయే అవకాశం ఉంది. యాపిల్ లో ఉండే యాసిడ్స్ పొట్టలో గ్యాస్ సమస్య పెరిగిపోవడానికి కారణం అవుతుంది. అలాగే డార్క్ చాక్లెట్స్ కూడా జీర్ణవ్యవస్థని దెబ్బ తీస్తుంది. ఈ కారణంగా సరిగా నిద్రపట్టదు. అలాగే వాటర్ కంటెంట్ ఉన్న పుచ్చకాయ, ద్రాక్ష వంటి వాటి కారణంగా మూత్రంలో వాటర్ కంటెంట్ పెరిగిపోయి రాత్రి సమయంలో నిద్రకి భంగం కలుగుతుంది. రాత్రి సమయంలో వీలైనంత వరకు అల్పాహారం తీసుకోవడం, అలాగే వేగంగా అరిగిపోయే ఆహారపదార్ధాలు తీసుకోవడం ఉత్తమం అని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.