Digital Entertainment: ప్రస్తుతం మూవీ ఎంటర్టైన్మెంట్ తో పాటు డిజిటల్ ఎంటర్టైన్మెంట్ కూడా ప్రేక్షకులకు అందుతుంది. ఇక కరోనా పాండమిక్ తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కంపెనీలు ఆధిపత్యం పెరిగింది అని చెప్పాలి. ఫ్యామిలీ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడం కోసం వెబ్ సిరీస్ లను తీసుకొస్తున్నారు. అలాగే సినిమాలను కూడా 50 రోజులు పూర్తికాకుండానే ఓటీటీలలో రిలీజ్ చేస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నారు. అయితే సినిమాలుకు మించి ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ లలో వెబ్ సిరీస్ లు చూడటానికి ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమా నటులు కూడా వెబ్ సిరీస్ లలో నటిస్తూ మరింతగా డిజిటల్ ఆడియన్స్ కి చేరువయ్య ప్రయత్నం చేస్తున్నారు. అయితే డిజిటల్ స్ట్రీమింగ్ ఆధిపత్యం పెరిగిన తర్వాత కొత్త కొత్త కథలని ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే యువత ఎక్కువగా డిజిటల్ ఎంటర్టైన్మెంట్ వైపు ఆసక్తి చూపిస్తూ ఉండడంతో వారిని టార్గెట్ చేసుకొని అడల్ట్ కంటెంట్ ని ఎక్కువగా రిలీజ్ చేసే ప్రయత్నం ఎక్కువగా జరుగుతోంది. \అలాగే మంచి కథలను కూడా బూతు సంభాషణలు ఎక్కువగా ఉపయోగిస్తూ వెబ్ సిరీస్ లను రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇలాంటి వెబ్ సిరీస్ లతో సమాజంలో కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులను క్రియేట్ అవుతున్నాయి. సినిమాకి సెన్సార్ ఉంటుంది అయితే డిజిటల్ ఎంటర్టైన్మెంట్ కి ఎలాంటి సెన్సార్ లేకపోవడంతో క్రియేటర్స్ ఇష్టానుసారంగా అడల్ట్ కంటెంట్ ని పోస్ట్ చేస్తూ ఉన్నారు.
గతంలో వచ్చిన మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికి తెలిసిందే. దానికి కారణం ఆ వెబ్ సిరీస్ లో ఉన్న బూతు సంభాషణలను చెప్పాలి. తాజాగా నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన రానా నాయుడు కూడా అలాంటి బూతు సంభాషణలతోనే కంటెంట్ ప్రజెంట్ చేయడం సంచలనంగా మారింది. ఇద్దరు స్టార్ యాక్టర్స్ నటించిన వెబ్ సిరీస్ ని ఈ స్థాయిలో అసభ్యంగా ప్రజెంట్ చేయడంపై చాలా మంది అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి అడల్ట్ కంటెంట్ వెబ్ సిరీస్ లు ప్రేక్షకులకు ఏ రకమైన మెసేజ్ ఇద్దామని అనుకుంటున్నారని రాజకీయ నాయకులు ప్రశ్నిస్తున్నారు.
ఖచ్చితంగా డిజిటల్ ఎంటర్టైన్మెంట్ కూడా సెన్సార్ ఉండాల్సిందే అని డిమాండ్ తెరపైకి తీసుకొస్తున్నారు. సెన్సార్ లేకుంటే భవిష్యత్తులో ఇంగ్లీష్ తరహా లోనే శృంగారాన్ని కూడా విచ్చలవిడిగా డిజిటల్ ఎంటర్టైన్మెంట్ పేరుతో చూపించేస్తారని అంటున్నారు. దీనికి కచ్చితంగా పుల్ స్టాప్ పడాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. నిజానికి ఈ మధ్యకాలంలో డిజిటల్ ఎంటర్టైన్మెంట్ లో అడల్ట్ కంటెంట్ విపరీతంగా పెరిగిపోయింది అని చెప్పాలి. ఒకప్పుడు అడల్ట్ కంటెంట్ చూడాలంటే వాటికి సంబంధించి ప్రత్యేకమైన వెబ్సైట్లు ఉండేవి. ఇప్పుడు ఆ అడల్ట్ కంటెంట్ నేరుగా ఓటీటీ ప్లాట్ఫామ్స్ లోనే దొరికేస్తుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.