Categories: EntertainmentLatest

Today Horoscope :  ఉద్యోగులకు అద్భుతమైన రోజు.. ఈ రాశి వారికి ప్రమోషన్లు పక్కా

Today Horoscope : శనివారం 25-03-2023 రోజున 12 రాశులలో ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది. ఎవరికి ఈ రోజు కలిసి వస్తుంది. ఎవరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ఎలాంటి కార్యక్రమాలు చేప్పటవచ్చు వంటి వివరాలను ఇప్పుడు చూద్దాం.

today-horoscope-saturday25-03-23

మేషం :

ఈ రాశి వారికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం ఎండగా ఉంటుంది బంధుమిత్రులతో ఈ రోజు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు సంతోషంగా గడుపుతారు. ఈ రాశి వారికి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కీలక విషయాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు వహించడం అవసరం. మరి ముఖ్యంగా కీలకమైన విషయాల్లో నిర్లక్ష్యం మంచిది కాదు. ఈ రాశి వారు గో సేవ చేయడం వల్ల ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చు.

 

వృషభం :

మీ పనుల్లో ఆటంకాలు అధికమవుతాయి. కొందరి ప్రవర్తన మీకు బాధ కలిగిస్తుంది. శ్రమతో కూడిన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు కాస్త నిరుత్సాహ ధోరణిలో ఉంటారు. కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కొత్త సమస్యలు కూడా ఏర్పడతాయి. మీ కోపాన్ని కాస్త తగ్గించుకుంటే మంచిది. గోసగా చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చు.

 

మిథునం :

ఈ రోజు ఈ రాశి వారికి చాలా దివ్యంగా ఉంది ఇది. అనుకూలమైన వాతావరణం కనిపిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి అభివృద్ధి కనిపిస్తుంది ఒక శుభవార్త వింటారు. అది మీకు, మీ కుటుంబానికి సంతోషాన్ని ఇస్తుంది. ఈ రోజు మీకు చాలా ఉత్సాహకరమైన రోజు. అధికారులు కూడా మీకు అనుకూలంగా ఉంటారు. అయితే అనవసర ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాస్త కంట్రోల్ లో ఉండడం మంచిది. శివుడిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.

 

కర్కాటకం :

సందర్భానికి తగ్గట్లుగా ఈ రాశి వారు వ్యవహరిస్తారు. మీరు చేపట్టే పనుల్లో మంచి ఫలితాలను పొందుతారు. ఉద్యోగంలో కూడా అనుకూలంగా ఉంటుంది మీ పై అధికారులు మీ పనిని చూసి ప్రశంసిస్తారు. పెద్దల ఆశీర్వచనాలు మీకు మెండుగా ఉంటాయి. అవే మీకు కార్యసిద్ధిలో ఫలిస్తాయి. మహాలక్ష్మిని ఆరాధించడం వల్ల శుభాలు కలుగుతాయి.

 

సింహం :

ఈ రాశి వారికి ఇది శుభకాలం.మనసుపెట్టి ఏ పని చేసినా అందులో నూటికి నూరు శాతం సత్ఫలితాలను పొందగలుగుతారు. మీ కుటుంబ సభ్యులతో మీరు సంతోషంగా ఉంటారు. మీ కృషికి తగ్గ ఫలితాలను మీరు పొందుతారు. మీరు చేపట్టే ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇష్టమైన దైవాన్ని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలను పొందవచ్చు.

 

కన్య :

ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. పనుల్లో ఆటంకాలు జరగకుండా కాస్త జాగ్రత్త వహించాలి. ముందు చూపుతోనే అన్ని కార్యక్రమాలను పూర్తి చేయాలి. బంధుమిత్రులతో కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వారితో ఆచితూచి వ్యవహరించాలి. డబ్బు ఖర్చు ఈ రోజు కనిపిస్తోంది. సుబ్రమణ్య భుజంగా స్తవం చదవడం వల్ల ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చు.

 

తుల :

ఉద్యోగంలో ఉన్న వ్యాపారంలో ఉన్న మీ తోటి వారి సహాయ సహకారాలు మీకు ఎప్పుడు లభిస్తాయి.

ఈ రాశి వారు ఏ పని చేసినా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతారు. ఉద్యోగంలో కూడా మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీ బుద్ధి బలంతో కొన్ని సమస్యలను పరిష్కరిస్తారు అందుకుగాను మీ పెద్దలనుంచి మనలను పొందుతారు. కుటుంబ సభ్యులతో ఈరోజు సంతోషంగా గడుపుతారు. విఘ్నేశ్వరుడిని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి.

 

వృశ్చికం :

ఉద్యోగస్తులయితే ఈ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంది. వీరి పనితీరును చూసి అధికారులు మెచ్చుకుంటారు. వారి దృష్టిని మీరు ఆకర్షిస్తారు. మీ చేతురులపై ఈరోజు విజయం సాధిస్తారు ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. హనుమాన్ దర్శనం వల్ల సత్ఫలితాలను పొందవచ్చు.

 

ధనుస్సు :

ఏది ఏమైనప్పటికీ మనోబలంతోనే మీరు ముందుకు సాగాల్సి ఉంటుంది. మనసుపెట్టి చేసే ఏ పనైనా సరే మీరు అందులో కచ్చితంగా విజయాలను సొంతం చేసుకుంటారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మీరు ప్రణాళికకు అనుగుణంగా ముందుకు సాగుతారు. బంధువులతో సంతోషంగా గడుపుతారు. హనుమాన్ చాలీసాను చదవడం వల్ల ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చు.

 

మకరం :

ఈ రాశి వారికి ఈ రోజు కాస్త శారీరక శ్రమ పెరిగే అవకాశం ఉంది చేపట్టే పనుల్లో అంతకు ముందున్నదాని కంటే ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఎవరితోనో వాదోపవాదాలు చేయకండి దుర్గ దేవి ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.

 

కుంభం :

ఈ రాశి వారికి ఇది సానుకూలమైన సమయం. మీరు చేపట్టే పనుల్లో విజయం తప్పనిసరిగా మిమ్మల్ని వరిస్తుంది. ఆశించిన దానికంటే మెరుగైన ఫలితాలని మీరు పొందగలుగుతారు. నీకు ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రయాణాలు చేసే ఉంటే జాగ్రత్తగా వివరించండి.

 

మీనం :

ఈ రాశి వారు ఓర్పుతో ఉండాల్సిన సమయం ఇది. ఏది ఏమైనా మనోబలంతో ముందుకు సాగాల్సి ఉంటుంది. మీరు ఈ రోజు కొన్ని కీలకమైన పనులు చేపట్టే అవకాశం ఉంది. అయితే పనులు ప్రారంభించిన అనంతరం కాస్త ఆటంకాలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ ప్రణాళిక ప్రకారం మీ పనులు పూర్తి చేసుకుంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ని దర్శించుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.

Sri Aruna Sri

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

3 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

3 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

This website uses cookies.