Devotional Tips: మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఉదయం సాయంత్రం దేవుడి ముందు దీపం వెలిగించి దీపారాధన చేస్తుంటాము. ఇలా దీపారాధన చేయటం వల్ల మనసు ఎంతో ప్రశాంతంగా ఉండటమే కాకుండా మనం చేసే పనులలో కూడా ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉంటాయని భావిస్తారు.అందుకే ప్రతిరోజు ఉదయం సాయంత్రం దేవుడి ముందు దీపం వెలిగించి చల్లగా చూడమని ప్రార్థిస్తాము. అయితే కొన్నిసార్లు మనం వెలిగించిన దీపం కొన్ని కారణాలవల్ల తొందరగా కొండ ఎక్కుతుంది.ఇలా దీపం కొండెక్కటం వల్ల ఆశుభం జరుగుతుందని ఆందోళన పడతారు.
మరి దీపం ఉన్నఫలంగా కొండేక్కిన తర్వాత ఏం జరుగుతుంది… దీపం ఆరిపోతే ఏం చేయాలి అనే విషయానికి వస్తే… మనం దీపారాధన చేసిన తర్వాత దీపం అర్ధాంతరంగా కొండెక్కితే కనుక వెంటనే కాళ్లు మొఖం శుభ్రంగా కడుక్కొని 108 సార్లు ఓం నమశ్శివాయ మంత్రాన్ని జపించి అనంతరం దీపరాధన చేయడం వల్ల అంతా శుభం కలుగుతుంది.ఇలా చేయటం వల్ల ఏ విధమైనటువంటి ఆ శుభాలు కలుగవు మనస్సు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది.
ఇక పూజ చేసే సమయంలో చాలామంది దేవుడికి ఎదురుగా దీపాలను పెట్టి పూజ చేస్తుంటారు ఇలా ఎదురుగా కాకుండా కాస్త ఆగ్నేయ మూలం వైపు దీపాలను పెట్టి పూజించాలి. ఇక చాలా మంది దీపారాధన చేసిన సమయంలో అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగిస్తారు ఇలా ఎప్పుడూ కూడా వెలిగించకూడదు. కొవ్వొత్తి లేదా అగరబత్తితో దీపాన్ని వెలిగించాలి. ఇక దీపం వెలిగించే సమయంలో చాలామంది ఒకే ఒత్తి వేసి దీపం వెలిగిస్తుంటారు. ఇది పూర్తిగా అపచారం చనిపోయిన వారి దగ్గర మాత్రమే ఒకే ఒత్తివేసి దీపం వెలిగిస్తారు. ఇలాంటి నియమాలను పాటించి దీపారాధన చేయడం మంచిది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.