Devi Sri Prasad: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో రాక్ స్టార్‌గా దేవి శ్రీ ప్రసాద్ కి ఎంతటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఆయన ఒక సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారంటే ఆ సినిమా ఖచ్చితంగా మ్యూజికల్ గా హిట్ అని ఫిక్స్ అవ్వాల్సిందే. ఒకదశలో దేవి శ్రీ కోసం పెద్ద హీరోలు కూడా వెయిట్ చేశారు. అయితే, థమన్ ఫాంలోకి వచ్చాక దేవి శ్రీ హవా కొద్దిగా తగ్గింది.
హీరోలందరూ థమన్ వైపు టర్న్ తీసుకున్నారు. కాస్త దేవి శ్రీకి దెబ్బ పడిందనే చెప్పాలి. కానీ, ‘పుష్ప’..’ఉప్పెన’ సినిమాలు మళ్ళీ రాక్ స్టార్ ని ఫాంలోకి తీసుకొచ్చాయి. ముఖ్యంగా పుష్ప పాన్ ఇండియన్ స్థాయిలో సక్సెస్ కావడానికి సగం క్రెడిట్ దేవి శ్రీ ప్రసాద్ కి ఇచ్చారు. అదే సమయంలో థమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఇస్తున్నా సాంగ్స్ విషయంలో ప్రతీసారి ట్రోల్స్ ఎదుర్కుంటున్నారు.
కాపీ క్యాట్ అనే కామెంట్స్ బాగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు థమన్, దేవి శ్రీల మధ్య ఠఫ్ కాంపిటీషన్ ఉంది. రెమ్యునరేషన్ పరంగా మాత్రం థమన్ కంటే దేవి శ్రీకే ఎక్కువ ఉందని ఇండస్ట్రీ వర్గాలో టాక్ ఉంది. ప్రస్తుతం డీఎస్పీ చేతిలో అరడజను సినిమాలున్నాయి. వాటిలో పుష్ప 2, నాగ చైతన్య-చందు మొండేటి సినిమా, పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ సినిమా ఉన్నాయి.
అలాగే, తమిళంలో సూర్య హీరోగా శివ రూపొందించబోతున్న పాన్ ఇండియా సినిమా, శేఖర్ కమ్ముల, ధనుష్ కాంబోలో మొదలబోతున్న మరో పాన్ ఇండియా సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ ఫిక్స్ అయ్యారట. ఈ సినిమాలలో ఒక్కోదానికి రాక్ స్టార్ 5 కోట్ల వరకూ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. ఎం ఎం కీరవాణి తర్వాత టాలీవుడ్ లో ఇంత హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ అని టాక్ వినిపిస్తోంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.