Dasara : ఎట్టకేలకు మహానటి సినిమా తర్వాత మళ్ళీ ఇంతకాలానికి కీర్తి సురేష్ ఖాతాలో ఓ కమర్షియల్ హిట్ పడింది. మహానటి సక్సెస్‌తో వరుసగా సినిమాలు ఒప్పుకుంది. వాటిలో చాలా సినిమాలు భారీ హిట్ సాధిస్తుందని ఎంతో నమ్మకంగా ఉంది. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలను ఒప్పుకొని అందరికీ షాకిచ్చింది. కానీ, ఆ సినిమాలే భారీ డిజాస్టర్ అయి రివర్స్‌లో కీర్తికి షాకిచ్చాయి.
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన అణ్ణాత్త కూడా హిట్ అనుకున్నారు. కానీ, ఆ సినిమా ఎలాంటి రిజల్ట్‌ను ఇచ్చిందో అందరికీ తెలిసిందే. ఇక నితిన్‌తో చేసిన రంగ్ దే, సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసిన సర్కారు వారి పాట కొంతవరకూ కీర్తిని కాపాడాయి. కానీ, పూర్తిగా ఒడ్డుకు మాత్రం చేర్చలేకపోయాయి. ఇప్పుడు నాని ఆ పని చేశాడు. దసరా సినిమాలో హీరోయిన్‌గా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల వద్దన్నా కూడా నాని నమ్మి తీసుకున్నాడు.
అంతేకాదు, దసరా రిలీజ్ అయ్యాక మొదటిరోజు కాస్త డివైడ్ టాక్ వచ్చినప్పటికీ డే 1 కలెక్షన్స్‌లో ఇటీవల వచ్చిన అన్నీ సినిమాలను బ్రేక్ చేసింది. నెమ్మదిగా దసరా సినిమా అన్నీ వర్గాల ప్రేక్షకులకీ ఎక్కుతోంది. బ్రేకీవెన్ కి దగ్గర్లో ఉంది. దాంతో మేకర్స్ సక్సెస్ సెలబ్రేషన్‌లో ఉన్నారు. ముఖ్యంగా కీర్తి సురేష్ చాలా ఆనందంగా ఉంది.
చాలాకాలం తర్వాత కీర్తి ఊహించని సక్సెస్ దక్కింది. అది కూడా నాని వల్లే. మొత్తానికి ఈ బ్యూటీని నాని లాక్కొచ్చి ఒడ్డున పడేశాడు. లేదంటే ఇప్పట్లో కీర్తి సురేష్‌కి హీరోయిన్‌గా అవకాశాలు వచ్చేవి కాదేమో. ఏదేమైనా దసరా కీర్తికి మంచి టర్నింగ్ పాయింట్ అయింది. ఇక ప్రస్తుతం అమ్మడు ఇదే ఊపులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో కీలకమైన పాత్రను చేస్తోంది. ఇది కూడా హిట్ అందుకుంటే ఇక కీర్తికి అవకాశాలు క్యూ కడతాయి.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.