Bollywood: అసలే టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ప్రస్తుతం సరైన హిట్ లేక సౌత్ ఆధిపత్యాన్ని తట్టుకోలేక సతమతం అవుతుంది. అలాగే ఇన్ని సంవత్సరాలు బాలీవుడ్ లో ఆధిపత్యం చలాయించిన ఖాన్ త్రయంకి ప్రస్తుతం సరైన హిట్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. అలాగే యాంటీ బీజేపీ, యాంటీ ముస్లిమ్ అనే విధంగా ఇప్పుడు సినిమా పరిశ్రమలు సెలబ్రిటీలతో పాటు ఫ్యాన్స్ కూడా విడిపోయారు. ఖాన్ త్రయం నుంచి సినిమాలు వచ్చాయంటే భారీ ఓపెనింగ్స్ తో నార్త్ మొత్తం షేక్ అయిపోయేది. అయితే ఇప్పుడు వారు సినిమా రిలీజ్ చేసిన ఓపెనింగ్స్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. దానికి తోడు స్ట్రాంగ్ ఇండియన్ ఎమోషన్ ఉన్న కథలు సిద్ధం చేయడంలో దర్శకుల విఫలం అవుతున్నారు.
అలాగే అలాంటి కథలని ఎంపిక చేసుకోవడంలో హీరోలు కూడా విఫలం అవుతున్నారు. ఎంత సేపు హీరోయిన్స్ ఎక్స్ పోజింగ్, బికినీ, క్రైమ్, పాశ్చాత్య పోకడలతోనే భారతీయ మూలాలని వదిలేసి. ఇండియన్ కల్చర్, ట్రెడిషన్, భావజాలాన్ని వ్యంగ్యంగా చిత్రీకరిస్తూ సినిమాలు చేసే వారు ఎక్కువ అయిపోయారు. ఓ విధంగా చెప్పాలంటే ప్రజలలో హిందుత్వ ఎమోషన్, ఇండియన్ నేషనలిజం అనే ఎమోషన్ ని బాలీవుడ్ సినిమా దూరం చేసే ప్రయత్నం చేస్తుందని కొన్ని వర్గాల వారి అభిప్రాయం.
అలాగే ఎంత సేపు టాలెంట్ లేకపోయిన సెలబ్రిటీ ఫ్యామిలీల నుంచి వచ్చిన వారే హీరోలు, హీరోయిన్స్ గా ఉంటూ కొత్త వారికి అవకాశాలు లేకుండా చేసేస్తున్నారు అనే అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంది. ఇక కేంద్రంలో బీజేపీ పార్టీకి యాంటీగా ఉంటూ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారు బాలీవుడ్ లో ఎక్కువ అయిపోయారు. అలాగే బీజేపీకి సపోర్టర్స్ గా ఉన్నవారు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే పఠాన్ సినిమా ని పాయింట్ గా చేసుకొని మళ్ళీ బాలీవుడ్ రెండుగా విడిపోయింది. కొంత మంది సెలబ్రిటీలు పఠాన్ సినిమాలోని ఓవర్ ఎక్స్ పోజింగ్ ని తప్పు పడుతున్నారు.
కొంత మంది అయితే సినిమాని సినిమాలా చూడాలని, సిచువేషన్, కంటెంట్ కి తగ్గట్లుగా హీరోయిన్స్ కాస్ట్యూమ్స్ ఉంటాయని, వాటిని ఎలా తప్పు పడతారని అంటున్నారు. అయితే పఠాన్ సాంగ్ లో దీపికా పదుకునే బికినీ వేయడాన్ని హిందుత్వ వాదులు, బీజేపీ నేతలు, సపోర్టర్స్ వ్యతిరేకించడం లేదు. కాషాయం రంగులో ఉన్న బికినీ వేసి అలాంటి అసభ్యకరమైన భంగిమలో కనిపించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. అయితే బీజేపీ నేతలు దీపికా వేసుకున్న కాషాయం రంగు బికినీ కాదని షారుక్ ఖాన్ మాత్రమే అని అతని ఫ్యాన్స్ అంటున్నారు. షారుక్ ఖాన్ ఒక ముస్లిమ్ గా ఉంటూ స్టార్ హీరోగా ఉండటం బీజేపీ వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నా రని అంటున్నారు.
అయితే బాలీవుడ్ లో షారుక్ ఖాన్ ని, అతని సినిమాలని అభిమానించే వారు చాలా మంది ఉంటారు. ఈ నేపధ్యంలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు షారుక్ ఖాన్ పఠాన్ సినిమాకి సపోర్ట్ గా నిలుస్తున్నారు. అసలు దీపికా వేసుకున్న డ్రెస్ లో అభ్యంతరం లేదని అంటున్నారు. తాజాగా షారుక్ ఖాన్ కూడా పఠాన్ మూవీ ఒక దేశభక్తి సినిమా అని, నన్ను వ్యతిరేకిస్తున్న వాళ్ళు సినిమా చూసాక మాట్లాడాలని అంటున్నారు. మొత్తానికి బాలీవుడ్ ఇండస్ట్రీలోకి రాజకీయాలు ప్రవేశించడం వలన మరికొంత కాలం హిందీ చిత్ర పరిశ్రమ గడ్డు కాలం నడుస్తుందనే మాట ఇప్పుడు వినిపిస్తుంది.
Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ జీనియస్ శంకర్ షణ్ముగ్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘గేమ్ ఛేంజర్’.…
Tollywood Exclusive: 2000 సంవత్సరం తర్వాత నటుడు, నిర్మాత అశోక్ కుమార్ తన బ్యానర్ లో ఒక సినిమాకు శ్రీకారం…
The Rana Daggubati Show Trailer: త్వరలో పాపులర్ ఓటీటీ అమెజాన్ ప్రైం లో టాలీవుడ్ టాల్ హీరో అయిన…
Bhagyashri Borse: తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. మాస్ మహారాజా రవితేజ-డైరెక్టర్ హరీశ్ శంకర్…
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
This website uses cookies.