Coconut Water: కొబ్బరి నీళ్ళు ఆరోగ్యానికి మంచివి. ముఖ్యంగా వేసవి కాలంలో కొబ్బరి నీళ్లు తాగటం వల్ల శరీరం హైటేటెడ్ గా ఉంటుంది. కొబ్బరి నీళ్లలో కార్బోహైడ్రేట్లు మరియు పొటాషియం, సోడియం మరియు మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి మరియు ఎలక్ట్రోలైట్ కూర్పును మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి. అందువల్ల వేసవికాలంలో తరచు కొబ్బరి నీరు తాగటం ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు సూచిస్తూ ఉంటారు. కొబ్బరి నీళ్లు తాగటం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అయితే కొబ్బరి నీరు తాగటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి.
రక్తపోటు లేదా పొటాషియంతో సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు మాత్రమే కొబ్బరి నీరు తాగటం మంచిది. ఎందుకంటే అధిక పొటాషియం సమస్య ఉన్నవారు కొబ్బరి నీరు తాగడం ద్వారా ఎలక్ట్రోలైట్ అసమతుల్యత సమస్య తలెత్తే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా శరీరంలో పొటాషియం స్థాయి వేగంగా పెరుగుతుంది. అలాగే పక్షవాతం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇక అధికంగా కొబ్బరి నీరు తాగటం వల్ల కిడ్నీ మీద కూడా ప్రభావం చూపుతుంది.కొబ్బరి నీళ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది, ఇది కిడ్నీపై ప్రభావం చూపుతుంది. అందువల్ల కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు మాత్రమే కొబ్బరి నీరు తాగటం మంచిది.
అలాగే ఏదైనా శస్త్ర చికిత్స చేయించుకున్న వారు కొబ్బరి నీళ్లు తాగకపోవడం మంచిది. ఎందుకంటే శస్త్రచికిత్స ముందు లేదా తర్వాత రక్తపోటు సమతుల్యతను కలిగి ఉండటం అవసరం. కానీ కొబ్బరి నీరు మీ రక్తపోటును తగ్గిస్తుంది. అలాగే తక్కువ రక్తపోటు సమస్య ఉన్నవారు కొబ్బరి నీళ్లకు దూరంగా ఉండాలి. కొబ్బరినీళ్లు తాగడం వల్ల శరీరంలో రక్తపోటు తగ్గుతుంది. అంతేకాకుండా అధిక బరువు ఉన్నవారు కూడా కొబ్బరినీటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే కొబ్బరి నీళ్లలో అధిక కేలరీలు ఉంటాయి. కొబ్బరి నీళ్లను ఎక్కువగా తీసుకుంటే శరీరంలో క్యాలరీలు పెరగడంతో పాటు బరువు కూడా పెరుగుతుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.