Turmeric: మన భారతీయ సంస్కృతిలో పసుపుకి చాలా ప్రాముఖ్యత ఉంది. పసుపుని శుభకార్యాలలో పవిత్రతకు సూచకంగా భావిస్తారు. అందువల్ల ఏదైనా శుభకార్యాలు జరిగేటప్పుడు పసుపు తప్పనిసరిగా ఉపయోగిస్తారు. అంతేకాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.అందువల్ల మనం తినే ఆహార పదార్థాలలో పసుపుని ఎక్కువగా ఉపయోగిస్తారు. అలాగే ఆయుర్వేదంలో కూడా పసుపుని విరివిగా ఉపయోగిస్తారు. ఇలా పసుపుని ఎన్నో విధాలుగా ఉపయోగిస్తారు.
అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వాస్తు దోషాల వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అయితే ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఫలితం ఉండదు. అటువంటి సమయంలో పసుపు ఎంతో ఉపయోగపడుతుంది. పసుపు ఉపయోగించి చేసే ఒక చిన్న పని వల్ల వాస్తు దోషాలు తొలగిపోయి ఆర్థిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. లక్ష్మీదేవిని సంపదకు భావిస్తారు. అందువల్ల లక్ష్మీదేవికి ఇష్టమైన పసుపుతో పూజించటం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది.
ప్రతి శుక్రవారం రోజున ఇంటిని, పూజగదిని శుభ్రం చేసుకుని లక్ష్మీదేవిని అందంగా అలంకరించి పసుపు సమర్పించాలి. అలాగే పసుపులో గంగాజలం కలిపి పూజ గదిలో స్వస్తిక్ గుర్తు వేయాలి. అలాగే ఇంటి ముఖ ద్వారం ముందు కూడా పసుపుతో ఇలా స్వస్తిక్ ఓం గుర్తులు వేయటం వల్ల వాస్తు దోషాలు తొలగిపోయి ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి. అంతేకాకుండా ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించకుండా ఉంటుంది.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.