Movies: ఇండియన్ సినిమా శైలి గతంతో పోల్చుకుంటే కరోనా సిచువేషన్ తర్వాత పూర్తిగా మారిందని చెప్పాలి. అంతకంటే ముందు బాహుబలి లాంటి పాన్ ఇండియా తర్వాత దర్శకుల ఆలోచనలు పూర్తిగా మారి కొత్త కథలతో కుస్తీలు పట్టడం మొదలు పెట్టారు. ఇండియన్ సినిమా అంటే కేవలం ఒక్క భాష మాత్రమే కాదని, అన్ని భాషలలో సినిమా రిలీజ్ అవ్వాలని, దేశ వ్యాప్తంగా ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యే కథలని సిద్ధం చేయాలని దర్శకులు అనుకుంటున్నారు. అలాగే హీరోలు కూడా కేవలం ఒక్క భాషకే తమ మార్కెట్ ని పరిమితం చేసుకోకుండా దేశ వ్యాప్తంగా విస్తరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమా మాత్రమే. అయితే హిందీ కూడా ఒక భాష మాత్రంగానే ఇప్పుడు మారిపోయింది. ముఖ్యంగా సౌత్ హీరోల ఆధిపత్యం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో స్పష్టంగా కనిపిస్తుంది.
నార్త్ ఇండియన్ ఆడియన్స్ కి మాత్రమే రీచ్ అయితే చాలు అనుకుంటూ హిందీ హీరోలు తమ సినిమాలని హిందీ భాషలలో మాత్రమే ఉండేలా చూసుకున్నారు. సౌత్ ఆడియన్స్ పై అస్సలు శ్రద్ధ చూపించేవారు కాదు. కాని ఇప్పుడు సినిమాలకి అత్యధిక కలెక్షన్స్ సౌత్ భాషల నుంచే వస్తున్నాయి. ఈ నేపధ్యంలో బాలీవుడ్ హీరోలు కూడా ఆలోచనలు మార్చుకొని సౌత్ ఆడియన్స్ ని గౌరవించడం మొదలుపెట్టారు. అలాగే సౌత్ ఇండియన్ ప్రేక్షకులకి నచ్చే ఎలిమెంట్స్ ని సినిమాలలో ఉండే విధంగా చూసుకుంటున్నారు. అలాగే సౌత్ లో తమ సినిమాలని ప్రమోట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు హీరోలు మార్కెట్ పరిధి పెంచుకొని మల్టీ స్టారర్ చిత్రాలు చేయడానికి ముందుకి వస్తున్నారు. పాన్ ఇండియా అప్పీల్ ఉన్న కథలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ ఫార్మాట్ ని లోకేష్ కనగారాజ్ ఇప్పటికే కోలీవుడ్ లో స్టార్ట్ చేశాడు. ఖైది, విక్రమ్ సినిమాలని సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కించాడు. అలాగే ప్రశాంత్ నీల్ మాఫియా, అండర్ వరల్డ్ బ్యాక్ డ్రాప్ లో పవర్ పాత్రలతో సినిమాలు చేస్తున్నాడు. కేజీఎఫ్ చాప్టర్స్, సలార్, నెక్స్ట్ ఎన్టీఆర్ మూవీలు ప్రశాంత్ నీల్ సినిమాటిక్ వరల్డ్ లో సిద్ధం అవుతున్నవే. అలాగే యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా హనుమాన్ తో ఇండియన్ సూపర్ హీరో సీక్వెల్స్ కి తెరతీసాడు. ఈ మూవీలో మైథాలజీలో దైవంగా భావించి హనుమాన్ ని సూపర్ హీరోగా పరిచయం చేస్తున్నాడు. అలాగే అధీరా అనే టైటిల్ తో ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ తో సినిమా చేస్తున్నాడు. ఆ క్యారెక్టర్ ని కూడా ఇండియన్ మైథాలజీ నుంచి తీసుకున్నదే. దాని తర్వాత విమెన్ సూపర్ హీరోని చూపించబోతున్నాడు.
ఇక నాని నిర్మాణంలో హిట్ సీక్వెల్స్ కూడా సినిమాటిక్ ఫార్మాట్ లో తెరకెక్కుతున్నవే. ఇక కార్తికేయ సీక్వెల్స్ కూడా వీలైనన్ని ఎక్కువ తీసుకొచ్చేందుకు చందూ మొండేటి సిద్ధం అవుతున్నారు. అలాగే ఆర్ఆర్ఆర్ సీక్వెల్ కూడా ఉండే ఛాన్స్ ఉందని రాజమౌళి క్లారిటీ ఇచ్చాడు. ఇక బాలీవుడ్ లో కూడా బ్రహ్మాస్త్ర మూవీని సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా సూపర్ పవర్స్ ఉన్న క్యారెక్టర్స్ మరిన్ని పరిచయం చేయడానికి అయాన్ సిద్ధం అవుతున్నారు. ఇలా ప్రాజెక్ట్ కె మూవీ అయితే అవుట్ ఆఫ్ ప్రెజెంట్ కాన్సెప్ట్ తో ఫ్యూచర్ వరల్డ్ ని నాగ్ అశ్విన్ ఆవిష్కరిస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ బట్టి మ్యాట్రిక్స్ తరహాలో సీక్వెల్స్ ప్లాన్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇలా సినిమా ఫార్మాట్, కథలు చెప్పే విధానాన్ని దర్శకులు మెల్లగా మార్చుకుంటూ పాన్ ఇండియా లెవల్ లో సినిమాలు చేస్తూ వరల్డ్ సినిమా ఇండస్ట్రీలో మన ఐడెంటిటి కచ్చితంగా ఉండేలా చూసుకుంటున్నారు.
Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ జీనియస్ శంకర్ షణ్ముగ్ కాంబినేషన్లో రూపొందిన సినిమా ‘గేమ్ ఛేంజర్’.…
Tollywood Exclusive: 2000 సంవత్సరం తర్వాత నటుడు, నిర్మాత అశోక్ కుమార్ తన బ్యానర్ లో ఒక సినిమాకు శ్రీకారం…
The Rana Daggubati Show Trailer: త్వరలో పాపులర్ ఓటీటీ అమెజాన్ ప్రైం లో టాలీవుడ్ టాల్ హీరో అయిన…
Bhagyashri Borse: తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. మాస్ మహారాజా రవితేజ-డైరెక్టర్ హరీశ్ శంకర్…
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
This website uses cookies.