Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న మెగా హీరోలందరికీ పూల బాట వేసింది చిరు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక్క హీరో ఇండస్ట్రీలో ఎన్నో కష్టాలను కూడా తన ఇష్టాలుగా పేర్చుకొని నిలబడితే, అదే ఆలయశిఖరం అవుతుంది..ఆయనే ఒక విజేత అవుతాడు..ఆయనే మనశంకరవరప్రసాదూ అవుతాడు. చిరంజీవి అంటే ఒక ప్రయాణం..చిరంజీవి అంటే ఒక ప్రస్థానం..చిరంజీవి అంటే అక్షరాలు సరిపోని పుస్తకాల సంగమం.
చిరంజీవి నటనలో దేవదాస్ కనకాల వద్ద శిక్షణ తీసుకున్నారు. కానీ, ఆ తర్వాత జనరేషన్ హీరోలందరూ ఆయన సినిమాలు..ఆయన నటన చూసే స్టార్స్ అయ్యారంటే ఒప్పుకోనివారుండరు. పవర్ స్టార్ గా పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ హిట్స్ అందుకున్నా, అంజనా ప్రొడక్షన్స్ స్థాపించి నాగబాబు నిర్మాతగా విజయాలందుకున్నా, చిరుతతో హీరోగా పరిచయమై పాన్ ఇండియా స్టార్ గా ఓ వెలిగుతున్న రామ్ చరణ్ అయినా..మిగతా మెగా హీరోలే కాకుండా ఆయన ఇంట్లో పెరిగి పెద్దై ఇప్పుడు హీరోలుగా నిలబడ్డ చాలామంది కథానాయకుల ముందు ఉంది మన మెగాస్టారే. ఆయన స్వయంకృషే.
చిరంజీవిగా పరిచయమై.. మెగాస్టార్‌గా పాపులరై.. అందరివాడిలా ఇండస్ట్రీలో అందరికీ తన సహాయ సహకారాలు, అండదండలు అందిస్తూ ఇప్పటికీ పాతికేళ్ల కుర్రాడిలా చక చకా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాలలో విశ్వంభర, బాబీ దర్శకత్వంలో ఓ సినిమా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరో సినిమా ఉన్నాయి. వీరితో పాటు సీనియర్ దర్శకుడు వి.వి.వినాయక్ కూడా చిరును డైరెక్ట్ చేసేందుకు కథలు వింటున్నాడు. మరికొందరు యువ దర్శకులు అన్నయ్యకి యాక్షన్-కట్ చెప్పడానికి స్క్రిప్టులతో సిద్ధంగా ఉన్నారు.
బింబిసార సినిమాతో దర్శకుడిగా మారాడు ఒకప్పటి నటుడు మల్లిడి వశిష్ఠ. హీరో అవ్వాలనుకొని వచ్చి దర్శకుడిగా మొదటి సినిమాతో హిట్ అందుకున్నాడు. ఇండస్ట్రీలో ఫస్ట్ మూవీ హిట్ అయితే, ఆ దర్శకుడిని సన్మానించి అవకాశం ఇవ్వడం మెగాస్టార్ కి అలవాటు. అలా అవకాశం అందుకున్న మల్లిడి వశిష్ట భారీ స్థాయిలో సోషియోఫాంటసీ చిత్రంగా విశ్వంభరను మొదలుపెట్టాడు. ఏడాదిక్రితమే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఇంకా, పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్‌లోనే ఉంది. ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలీదు. చాలామంది ఇండస్ట్రీలో ఉన్నవారు.. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అంజి సినిమాతో పోల్చుకుంటున్నారు.
అంటే, ఆ సినిమాలా ఇంకా నాలుగేళ్ళు పడుతుందనా లేక కంప్యూటర్ గ్రాఫిక్స్ సెట్ అవక ప్రేక్షకులను డిసప్పాయింట్ చేస్తుందనా.. అంటే అన్నయ్య హీరో కాబట్టి, ఏ ఒక్కరూ కామెంట్ చేయడానికి వీల్లేదు. వాస్తవానికి, ఈ మూవీ కోసం చిరు ఎంతో శ్రమించారు. చాలా ఏళ్ళ తర్వాత త్రిష కి కంబ్యాక్ మూవీ. మన మెగాస్టార్ విశ్వంభర తో పాటు ప్రకటించిన సినిమాలన్నీ రిలీజైపోయాయి. కానీ, ఈ సినిమా విషయంలో మేకర్స్ నుంచి క్లారిటీ రావడం లేదు. అభిమానులు మాత్రం ఎంతో ఊహించుకుంటున్నారు. మరి, ఆ ఊహలకి మించి విశ్వంభర ఉంటుందా? అనేది తెలియాలంటే ఎంత ఆలస్యం అయినా సినిమా థియోటర్స్ కి వచ్చేదాకా ఆతృతగా ఎదురుచూడాల్సిందే.
Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…
Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…
Tollywood : టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు బాలీవుడ్‌లో ఓ భారీ చిత్రాన్ని నిర్మించంబోతున్నట్టుగా గత కొంతకాలం నుంచి…
Peddi Movie: పెద్ది కథ లీక్? తండ్రీ కొడుకులుగా రామ్ చరణ్! అవును ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా అభిమానుల్లో…
Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమా వారణాసి. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ…
This website uses cookies.