Chiranjeevi-trisha : త్రిష కోసం నేను నిలబడతా..మెగాస్టార్ భరోసా

Chiranjeevi-trisha : మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో హీరోగా తన టాలెంట్ తో పైకి వచ్చిన గొప్ప వ్యక్తి అయన. తనని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఎంతో మంది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ సెలబ్రిటీలు కూడా అయ్యారు. సినీ రంగానికి ఓ పెద్ద దిక్కు చిరంజీవి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రియల్ లైఫ్ లోనూ ఎన్నోసార్లు హీరోగా తన మంచి మనసునుచాటుకున్నారు మెగాస్టార్. ఎన్నో సామాజిక కార్యక్రమాలలో పాల్పంచుకున్నారు అంతేకాదు ఎవరికి ఎలాంటి సహాయం కావాలన్నా ఎవరిని ఎలాంటి కామెంట్ చేసినా ముందు వరుసలో నిలబడి వారికి మద్దతు తెలుపుతారు తాజాగా కోలీవుడ్ బ్యూటీ త్రిషకు మద్దతుగా నిలుస్తున్నారు మెగాస్టార్. నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు.

chiranjeevi-trisha-i-support-trisha-says-megastarchiranjeevi-trisha-i-support-trisha-says-megastar
chiranjeevi-trisha-i-support-trisha-says-megastar

కోలివుడ్ యాక్టర్ మన్సూర్ అలీ ఖాన్ నటి త్రిషపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు.మన్సూర్ కామెంట్స్ ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. మన్సూర్ తీరును తప్పుపడుతూ ఇప్పటివరకు ఎంతోమంది సినీ సెలబ్రిటీలు త్రిషకు సపోర్టుగా నిలుస్తున్నారు. తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని త్రిషకు సారీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక సీనియర్ నటి కుష్బూ అయితే ఏకంగా మహిళా కమిషన్ నుంచి కేసు కూడా నమోదు చేయించింది. టాలీవుడ్ హీరోలు కూడా చాలామంది త్రిషకు సపోర్టుగా నిలుస్తున్నారు. రీసెంట్ గా హీరో నితిన్ ఈ వివాదం పై స్పందించాడు త్రిషకు మద్దతుగా నిలిచాడు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ వివాదంపై ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు.

chiranjeevi-trisha-i-support-trisha-says-megastar

” త్రిష పైన మన్సూర్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి. ఒక నటిపై ఇలాంటి కామెంట్స్ చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నా సపోర్ట్ త్రిషకు ఎప్పటికీ ఉంటుంది.మన్సూర్ తన వక్ర బుద్ధితో ఇలాంటి కామెంట్స్ చేశాడు.త్రిషనే కాదు ఇలాంటి కామెంట్స్ ఏ మహిళపై చేసిన నేను ఊరుకోను. మహిళలకు అండగా నేను నిలబడతాను”. అని మెగాస్టార్ తన సపోర్ట్ అని తెలిపారు.

chiranjeevi-trisha-i-support-trisha-says-megastar

మన్సూర్ రీసెంట్ గా రిలీజ్ అయిన విజయ్ లియో మూవీలో విలన్ గా నటించాడు ఈ మూవీలో త్రిష హీరోయిన్. అయితే ఓ ఇంటర్వ్యూలో తాజాగా మన్సూర్ మాట్లాడుతూ.. ” ఇండస్ట్రీలో నేను చాలా సినిమాల్లో రేప్ సీన్లలో నటించాను. లియో మూవీలో ఆఫర్ వచ్చినప్పుడు త్రిష తో కూడా అలాంటి సీను ఉంటుందని అనుకున్నా. కానీ సినిమాలో అలాంటి సీన్ ఏమీ లేదు. అందుకు చాలా ఫీల్ అవుతున్నా” అని కామెంట్ చేశాడు. దీంతో ఈ కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. నెట్టింట్లో దుమారం రేపుతున్నాయి. తాజాగా మన్సూర్ ఈ వ్యాఖ్యలపై వివరణ కూడా ఇచ్చారు. తనకు త్రిష అంటే గౌరవం ఉందని సరదాగా మాట్లాడిన మాటల్లో ఇలా వివాదాస్పదంగా మార్చారని ఆయన ఆరోపించారు.

 

Sri Aruna Sri

Recent Posts

Tollywood : వైరల్ ప్రపంచం మూవీ రివ్యూ

Tollywood : డిజిట‌ల్ యుగంలో మ‌న‌కు ఎన్ని సౌక‌ర్యాలు అందుతున్నాయో అన్నీ స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి. టెక్నాల‌జీని స‌రిగ్గా వాడుకోక‌పోతే ఒక్కోసారి…

5 days ago

Tollywood: ప్రభాస్ లైనప్ లో క్లారిటీ లేదే.?

Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…

3 weeks ago

Akka: కీర్తి సురేశ్ ఇలాంటి రోల్ చేస్తుందా..?

Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన…

4 weeks ago

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..?

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు…

2 months ago

Tollywood Cinema: ఈ సినిమాలు ఫ్లాపా కాదా..క్లారిటీ ఇదే..!

Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు…

2 months ago

సినీ లవర్స్ కోసం ‘అరి’ టీం కొత్త ఆఫర్.. వాట్సప్ చేసి సినిమాని చూడండి

జయ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అరి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్…

2 months ago