Chicken: చికెన్ అంటే ఇష్టం లేనివారు ఉండరు ప్రతిరోజు ఏదో ఒక రూపంలో చికెన్ తమ ఆహారంలో భాగం చేసుకుని తింటూ ఉంటారు. ఇలా చికెన్ వివిధ రకాలుగా తయారు చేసుకొని తినడానికి ఎంతో మంది ఇష్టపడుతూ ఉంటారు కానీ చాలామంది చికెన్ లివర్ తినడానికి ఏమాత్రం ఇష్టపడరు. చికెన్ లివర్ తినటం వల్ల ఆనారోగ్య సమస్యలు ఉంటాయని బాగా శరీర బరువు పెరిగిపోతారని అందరూ భావిస్తూ ఉంటారు నిజంగానే చికెన్ లివర్ తినడం మంచిది కాదా లేకపోతే చికెన్ లివర్ తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చా అనే సందేహాలు చాలామందికి కలుగుతూ ఉంటాయి.
చికెన్ లివర్ తినకూడదని చాలామంది పక్కన పెట్టేస్తూ ఉంటారు అలా చికెన్ లివర్ కనుక తినకుండా ఉన్నారంటే మీరు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోయినట్లేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి చికెన్ లివర్ తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..చికెన్ లివర్ లో విటమిన్ ఎ, బి, ప్రోటీన్లు , మినరల్స్, ఐరన్, విటమిన్ బి 12, ఫొలేట్, కాల్షియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.. అందుకే క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు చికెన్ లివర్ ను తీసుకోవడం వల్ల రక్త, చర్మ సమస్యలు కూడా దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఇక ఇందులో బి12 అధికంగా ఉండటం వల్ల రక్త సరఫరా పుష్కలంగా జరుగుతుంది. అలాగే కాళ్ళు నొప్పులు తిమ్మిర్లు వంటివి కూడా తగ్గుతాయి.మతి మరుపు, జ్ఞాపక శక్తిని మెరుగు పరుస్తుంది.. చికెన్ లివర్ డయాబెటిస్ పేషెంట్లకు కూడా మంచిది. మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తుంది. ఇలా ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కదా అని ప్రతిరోజు ఎక్కువ మోతాదులో లివర్ తీసుకుంటే అది అనారోగ్యానికి కారణమవుతుంది. అందుకే సరైన మోతాదులో లివర్ తినడం ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.