Chandrayan 3 : భారత్ జాబిల్లిపై కాలు మోపింది.చంద్రయాన్ 3 ప్రయోగం సుక్సెస్ అయ్యింది. చంద్రుడు పై కాలు మోపినప్పటినుంచి లాండర్ రోవర్ తన పనిని మొదలుపెట్టాయి. చంద్రుడిపై ఉన్న వనరుల జాడను తెలుసుకునేందుకు గాను రోవర్ చంద్రుడు పై చక్కర్లు కొట్టింది శాస్త్రవేత్తలకు ఎంతో విలువైన సమాచారాన్ని అందించింది. అయితే ప్రస్తుతంచం చంద్రయాన్ 3 ల్యాండర్, రోవర్ జాబిలమ్మ ఒడిలో హాయిగా నిద్రపోతున్నాయి. ఇదిలా ఉండగా 14 రోజుల తర్వాత జాబిల్లిపై మళ్లీ సూర్యోదయం జరగనుంది. ఈ క్రమంలో ఇస్రో శాస్త్రవేత్తలు వాటిని నిద్రావస్థ నుంచి యాక్టివ్ చేసేందుకు సిద్ధమయ్యారు. శాస్త్రవేత్తలు ప్రజ్ఞాన్ రోవర్ తో కమ్యూనికేట్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.
అయితే చంద్రుడిపై ఇన్నాళ్లు నిద్ర అవస్థలో ఉన్న ఇవి అక్కడి శీతల ఉష్ణోగ్రతలను తట్టుకొన్న మళ్ళీ మనుగడ సాగిస్తాయా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఈ విషయంపై ఓ క్లారిటీ ఇచ్చేశారు. సన్ లైట్ ని గుర్తించి ల్యాండర్, రోవర్ మళ్లీ వాటంతట అవే పని ప్రారంభించే ప్రక్రియ అంతా కూడా ఆటోమేటిగ్గా జరుగుతుందని చెప్పారు.
ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్ 3 ప్రయోగాన్ని ఇస్రో జులై 14న చేపట్టింది. అగస్ట్ 23న చంద్రడిపై విక్రమ్ ల్యాండర్ స్మూత్ గా ల్యాండ్ అయ్యింది. ఆ తర్వాత ల్యాండర్ నుంచి ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వచ్చి తమ పనిని కంప్లీట్ చేసింది. శాస్త్రవేత్తలకు విలువైన సమాచారాన్ని అందించింది. ఈలోగా జాబిల్లిపై రాత్రి కావడంతో సెప్టెంబర్ 3న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లను స్లీప్ మోడ్ లోకి పంపించారు ఇస్రోశాస్త్రవేత్తలు. ఈ క్రమంలో మళ్ళీ చంద్రుడిపై సూర్యోదయం జరుగుతుండటంతో ఒకవేళ ల్యాండర్, రోవర్ తిరిగి పనిచేస్తే జాబిల్లిపై చంద్రయాన్-3 ప్రయోగాలకు బోనస్ లభించినట్లు అవుతుంది. అందుకే శాస్త్రవేత్తలు ఆ సమయం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రజల సైతం జాబిల్లి వైపే చూస్తున్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.