Chandrababu Naidu: ఏపీ రాజకీయాలలో అధికార పార్టీ వైసిపి ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మధ్య తారాస్థాయిలో రాజకీయ పోరు నడుస్తూ ఉంది. ఇక తెలుగుదేశం పార్టీలో రాజకీయంగా ఎదిగి ఇప్పుడు వైసీపీలో కొనసాగుతున్న నాయకులే ముఖ్యంగా చంద్రబాబు నారా లోకేశ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉండడం విశేషం. కొడాలి నాని, ఆర్కే రోజా, వల్లభనేని వంశీ ముగ్గురు కూడా టిడిపి నుంచి రాజకీయ ప్రయాణం మొదలుపెట్టారు.
ఇప్పుడు వారు చంద్రబాబుకి బద్ధ శత్రువులుగా మారిపోయారు. నిత్యం ఏదో ఒక అంశంపై చంద్రబాబు నారా లోకేష్ పై మీరు తీవ్రస్థాయిలో దూషణల కూడా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని అయితే చంద్రబాబు నాయుడుకి పెద్ద తలనొప్పిగా మారారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోటలో ఉన్న గన్నవరం నియోజకవర్గ ఇప్పుడు కొడాలి నాని కారణంగా వైసిపి చేతుల్లోకి వెళ్లిపోయింది.
అయితే తిరిగి అక్కడ పునర్వైభవాన్ని తీసుకురావాలని, వచ్చే ఎన్నికల్లో గెలవాలని లక్ష్యంగా చంద్రబాబు నాయుడు పెట్టుకున్నారు. గుడివాడ నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉన్నారు. ఈ పర్యటనలోనే గుడివాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని కూడా చంద్రబాబు నాయుడు ప్రకటించే అవకాశం ఉందని మాట వినిపిస్తూ ఉంది. రానున్న ఎన్నికల్లో కొడాలి నానిని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబు ఆదిశగా వ్యూహాలు సిద్ధం చేస్తున్నాం అయితే కొడాలి మాత్రం తెలుగుదేశం పార్టీ తనను ఓడించలేదంటూ ధీమాగా ఉన్నారు. ప్రజలలోకి బలంగా వెళ్లిపోయిన కొడాలి నానిని ఓడించాలంటే కచ్చితంగా బలమైన వ్యూహాలను చంద్రబాబు సిద్ధం చేసుకోవాల్సిందే.
మరి ఈ సమయంలో బాబు ఎలాంటి అడుగులు వేస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు వచ్చే ఎన్నికలలో భారీగా సీట్లు సొంతం చేసుకొని అధికారంలోకి రావాలని చంద్రబాబు గట్టిగా కసరత్తు చేస్తున్నారు. దీనికోసం వ్యూహాత్మకంగా ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేసుకుంటూ వెళ్తున్నారు. జనసేన తమతో కలిసి వస్తుందని చంద్రబాబు ఇప్పటికే ఒక క్లారిటీతో ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ కి వాయిస్ ఎక్కువగా ఉంటే తర్వాత తెలుగుదేశం పార్టీని డామినేట్ చేసే అవకాశం ఉందని ముందుగానే బలమైన వ్యూహాలతో బాబు రాజకీయాలు చేస్తూ ఉండడం విశేషం.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.