Chandra Mohan : చంద్రమోహన్ ఏం చదివారు? ఆయన భార్య ఎవరు? పిల్లలు ఎంతమంది ?

Chandra Mohan :  సీనియర్ నటుడు చంద్రమోహన్  హార్ట్ ఎటాక్ తో చనిపోయారు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో దాదాపు 900కు పైగా సినిమాల్లో నటించిన హిస్టరీ చంద్రమోహన్ సొంతం. తన సహజ సిద్ధమైన నటనతో హావభావాలతో తెలుగు ప్రేక్షకులను కొన్నేళ్లు అలరించారు చంద్రమోహన్. ఆయన సినీ కెరీర్ నుంచి ఇండస్ట్రీలోని వారికకే కాదు తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు.  అయితే ఆయన పర్సనల్ లైఫ్ గురించి మాత్రం క్లోజ్ ఫ్రెండ్స్ కి మాత్రమే తెలుసు.

chandra-mohan-education-wife-and-children-details

చంద్రమోహన్ బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేశారు. అయినా నటన మీద ఉన్న అభిమానంతో సినిమా రంగం వైపు వచ్చారు. ఆయన భార్య జలంధర బి ఏ ఎకనామిక్స్ చేశారు.ఆమె ఒక ప్రముఖ రచయిత్రి. దాదాపు 100కు పైగా కథలు,  నవలలు రాశారు. ఎన్నో  సాహితీ పురస్కారాలను ఆమె అందుకున్నారు. ఒకవైపు సినిమాల్లో చంద్రమోహన్ రాణిస్తుంటే, మరోవైపు  భార్య జలంధర రచయిత్రిగా మంచి పేరు సంపాదించుకున్నారు. వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా  ఆదర్శ దంపతుల జీవిత సాఫల్య పురస్కారం వరించింది.

chandra-mohan-education-wife-and-children-details

చంద్రమోహన్, జలంధరలకు ఇద్దరూ కూతుర్లు. పెద్ద కూతురు  మధుర మీనాక్షి, చిన్న కూతురు మాధవి. పిల్లలు ఇద్దరికీ వివాహం జరిగింది. మీనాక్షి సైకాలజిస్ట్ గా అమెరికాలో సెటిల్ అయ్యింది. చిన్న కూతురు మాధవి డాక్టర్. ఆమె చెన్నైలోనే ఉంటున్నారు. చంద్రమోహన్ ఫ్యామిలీ మొత్తం వెల్ సెటిల్డ్ . అంతేకాదు దివంగత దర్శకులు కళాతపస్వి కే విశ్వనాథ్ కూడా చంద్రమోహన్ కు రిలేటివ్ అవుతారు.

chandra-mohan-education-wife-and-children-details

సినిమాల్లోకి రావడానికి మాత్రమే కాదు ఇండస్ట్రీలో ఎదగడానికి  విశ్వనాథ్ గారు ఎంతో సపోర్ట్ చేశారని చంద్రమోహనే ఎన్నో  సందర్భాల్లో తెలిపారు. అంతేకాదు వీరిద్దరూ పక్కపక్కనే ఇల్లు కట్టుకుని 25 ఏళ్లు  చెన్నైలోనే ఉన్నారు. ఆ తర్వాత ఇండస్ట్రీ మొత్తం చెన్నై నుంచి హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యాక ఆయన చెన్నైలోనే ఉన్నారు.  షూటింగులు ఉంటే మాత్రం హైదరాబాద్ కు వచ్చేవారని సమాచారం.

Sri Aruna Sri

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

3 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

3 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

This website uses cookies.