Chaitanya Jonnalagadda : మెగా డాటర్ నిహారిక , చైతన్య జొన్నలగడ్డ ఈ మధ్యనే విడాకులు తీసుకున్నారు. కారణాలు తెలియవు కానీ వారిద్దరూ విడాకులు తీసుకుని ఎవరి లైఫ్ లో వారు బిజీ అయిపోయారు. ఇటు నిహారిక తన సినీ కెరీర్ కంటిన్యూ చేస్తుంటే చైతన్య తన కెరీర్ పై దృష్టిపెట్టాడు. ఇదిలా ఉంటే వీరిద్దరూ ఎందుకు విడాకులు తీసుకోవాల్సి వచ్చింది అనేదానిపై సోషల్ మీడియాలో తరచుగా వార్తలు వస్తున్నాయి. చాలా రూమర్స్ కూడా వచ్చాయి. అయితే వాటిపై చైతన్య కానీ, నిహారిక కానీ ఎప్పుడు రెస్పాడ్ కాలేదు. అయితే తాజాగా నిహారిక ఓ ఇంటర్వ్యూలో డివోర్స్ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. మొదటిసారి విడాకులపై ఓపెన్ అయ్యింది మెగా డాటర్. ఎవరూ డివోర్స్ తీసుకోవాలని పెళ్లి చేసుకోరని, అలాగని ఇష్టంలేకపోయినా బలవంతంగా కూడా కలిసి ఉండలేరు కదా? అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ ఇంటర్వ్యూ వీడియోను సెలబ్రిటీ యాంకర్ నిఖిల్ తన ఇన్స్టాగ్రామ్ పేజ్‌లో షేర్ చేశాడు. ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నెటిజన్స్ ఈ ఇంటర్వ్యూపై పెద్ద చర్చే పెట్టారు. . ఆమె కామెంట్స్ విన్న కొందరు చైతన్యను నిందిస్తున్నారు.
ఇంటర్వ్యూలో నిహారిక మాట్రాడుతూ…” డివోర్స్ తర్వాత నేను చాలా ఫీల్ అయ్యాను. మాది లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్ మ్యారేజ్. కొన్ని విషయాల్లో మా ఇద్దరికీ సెట్ అవ్వక డివోర్స్ తీసుకోవాల్సి వచ్చింది. మిగతా అమ్మాయిల్లాగే నేను పెళ్లిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. కానీ ఎప్పుడు ఎదుటివ్యక్తిపై డిపెండై జీవించడం కుదరదు కదా. పెళ్లితో ఓ గుణపాఠం నేర్చుకున్నాను. అందరూ మన పేరెంట్స్ లా ఉండరు. వారిలా ప్రేమగా చూసుకోరు. అందుకే పెళ్లి చేసుకోవడానికి ముందే ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకోవాలి. మనకు సెట్ అవ్వని వ్యక్తిపై ఆధారపడకూడదు” అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది నిహారిక.
ఈ వీడియోపై తాజాగా చైతన్య జొన్నలగడ్డ ఫైర్ అయ్యాడు. నిహారిక కామెంట్స్ కి ఇన్‌డైరెక్ట్ గా గట్టి కౌంటర్ ఇచ్చాడు. అఖిల్ కు ఓ నోట్ రాసి వార్నింగ్ ఇచ్చాడు. నోట్ లో ఏముందంటే..”హాయ్ నిఖిల్ విడాకుల తర్వాత నిహారికపై జరుగుతున్న నెగిటివిటీని దూరం చేయడానికి నువ్వు చేసిన ప్రయత్నాన్ని అభినందిస్తున్నాను. అవును పర్సనల్ గా వచ్చే రూమర్స్ ను ఎదుర్కొవడం అంత ఈజీ అయిన విషయం కాదని నాకూ తెలుసు. కానీ ఇలాంటి ప్లాట్ ఫామ్స్ లో దాని బాధితులను కూడా మీరు పరోక్షంగా ట్యాగ్ చేయడం ఎట్టిపరిస్థితుల్లో కరెక్ట్ కాదు. ఇకపై ఇలాంటి మానితే మంచిది. ఇలా జరగడం ఇది సెకెండ్ టైమ్. ఏదైన ఇష్యూ ఉంటే దానివల్ల పడే బాధ ఇరువైపులా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రయత్నాల వల్ల ఎదుటి వ్యక్తికి ఇంకా బాధ, నొప్పి కలిగిస్తాయి.
అసలు వాస్తవం ఏమిటనేది రెండువైపులా అడిగి మరీ తెలుసుకోవాలి, వాస్తవాన్ని చూపించాలి. వన్ సైడ్ నుంచే విని జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. డివోర్స్ తర్వాత కలిగే నొప్పి, బాధ గురించి, దాని నుంచి ఎలా బయటపడ్డారనే విషయంపై మాట్లాడుకుంటే బెటర్. అది జనాలకు కూడా యూస్ అవుతుంది. ఫ్యూచర్ లో ఇలాంటి ప్రయత్నాలు చేసేటప్పుడు ఆ ఇష్యూతో రిలేషన్ ఉన్న అందరితో మాట్లాడి ప్రజలకు అవగాహన కల్పించాలి. ఏం తెలియకుడా ఒకవైపు నుంచే జడ్జ్ చేసి కామెంట్స్ చేయడం చాలా తప్పు. అందులోనూ ఇలాంటి వేదికలను ఉపయోగించి ప్రజలకు ఒకవైపు నుంచే జరిగింది చెప్పడం కూడా తప్పు. ఇది నీకు అర్థం అవుతుందని ఆశిస్తున్నాను” అంటూ చైతన్య ఓ నోట్ రాసుకొచ్చాడు. ఆ నోట్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.