Left Over Rice: అన్నం పరబ్రహ్మ స్వరూపం అని పెద్దలు చెబుతూ ఉంటారు. అన్నం వేస్ట్ చేయకూడదని, అలా అన్నాన్ని వృధా చేస్తే భవిష్యత్తులో తినడానికి అన్నం కూడా పుట్టదని పెద్దలు హెచ్చరిస్తూ ఉంటారు. ప్రస్తుత రోజుల్లో చాలా మంది రాత్రి సమయంలో ఎక్కువగా వండి ఉదయాన్నే తినడం ఇష్టం లేక వాటిని పడేస్తూ ఉంటారు. ఇంకొందరు మాత్రం అందర్నీ పడేయడం ఇష్టం లేక రాత్రి మిగిలిన అన్నాన్ని ఉదయాన్నే తింటూ ఉంటారు. రోజుల్లో మన పెద్దలు ఈ విధంగానే చేసేవారు. ఇప్పటికీ చాలామంది ఇలా అన్నాన్ని ఉదయాన్నే తింటున్నారు. అయితే చాలామందికి రాత్రిపూట మిగిలిన అన్నం తినవచ్చా? తింటే ఏమైనా జరుగుతుందా అన్న సందేహం కలిగే ఉంటుంది.
రాత్రి పూట మిగిలిన అన్నంలోకి ఉదయం లోపు బాక్టీరియా చేరుతుంది. రాత్రి నుంచి ఉదయం వరకు ఆ అన్నం అలాగే ఉంటుంది. కనీసం 10 గంటలు ఆ అన్నం వంటింట్లోనే అలాగే ఉండటం, అలాగే రాత్రి పూట వేడి ఎక్కువగా ఉంటే ఉదయం లేచేసరికి ఆ అన్నంలో బాక్టీరియా ఫామ్ అవుతుంది. ఆ బాక్టీరియా ఉన్న అన్నాన్ని తిన్నప్పుడు ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. దాంతో వాంతులు విరోచనాలు వంటివి అవుతాయి. అందుకే రాత్రిపూట మిగిలిపోయిన అన్నం ఉదయాన్నే తినకూడదని వైద్యులు చెబుతూ ఉంటారు. ఇదివరకటి రోజుల్లో పెద్దలు తినేవారు కదా వారికి ఏమి జరగలేదు కదా అన్న సందేహం కలిగి ఉండవచ్చు.
అయితే ఇదివరకటి రోజుల్లో ఆహారం ఇలాంటి కలుషితం లేకుండా ఉండేది. కానీ ప్రతి పరిస్థితి రోజుల్లో ప్రతి ఒక్క వస్తువు కూడా కలుషితమైనదే. కాబట్టి రాత్రి మిగిలిన చద్దన్నం పొద్దున్నే తినకపోవడం మంచిది. ఫుడ్ పాయిజనింగ్ ప్రతిసారి కాకపోయినా, ఎప్పుడో ఒకసారి మాత్రం ఫుడ్ పాయిజన్ అవుతుంది. ఎందుకంటే కిచెన్ ఉష్ణోగ్రత పెరిగితే బాక్టీరియా ఎక్కువగా తయారవుతుంది. దాని వల్ల ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. నిజానికి అన్నం వండగానే రెండు గంటల లోపు తినేయాలి. ఒకవేళ తినడం లేట్ అయితే కొంత సేపు ఫ్రిజ్ లో పెట్టవచ్చు. అది కూడా ఎక్కువ సేపు ఫ్రిజ్ లో పెట్టకూడదు. అలాగే రాత్రి పూట ఫ్రిజ్ లో పెట్టి కూడా ఉదయం పూట తినకూడదు. ఫ్రిజ్ లో పెట్టి మరుసటి రోజు ఏం తినకూడదు. అప్పటికప్పుడు ఒక గంట, రెండు గంటల కోసం మాత్రమే ఫ్రిజ్ లో పెట్టాలి. అలాగే.. అన్నాన్ని చాలామంది వేడి చేసి తింటారు. ఒకసారి అన్నాన్ని వండాక మళ్లీ వేడి చేయకూడదు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.