Vijay-srileela : ఆ సినిమా నుంచి తప్పుకున్న శ్రీలీల..యానిమల్ బ్యూటీకి ఛాన్స్?

Vijay-srileela : విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో ఈ పేరుకు మంచి బ్రాండ్ ఉంది. అమ్మాయిలు ఈ పేరు వింటే చాలు ఫుల్ ఎగ్జైటెట్ గా ఫీల్ అవుతారు. మొదటి సినిమా నుంచి తన యాటీట్యూడ్ , నటనతో అందరి హృదయాలను గెలుచుకున్నాడు విజయ్. మరీ ముఖ్యంగా తెలుగు అమ్మాయిల క్రేజీ హీరోగా ఫేమస్ అయ్యాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రౌడీ బాయ్ కి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సందీప్ రెడ్డి వంగ రూపొందించిన అర్జున్ రెడ్డి మూవీతో విజయ్ క్రేజ్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా పెరిగిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వరుసగా సినిమాలు చేస్తూ తన అభిమానులను అలరిస్తున్నాడు. హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా కెరీర్ లో బ్రేకులు వేయకుండా ముందుకెళ్తున్నాడు. లైగర్ ఫ్లాప్ తర్వాత నటించిన ఖుషి మూవీ మంచి హిట్ సాధించడంతో ఇప్పుడు వరుసగా సినిమాలు చేసేందుకు రెడీ అయ్యాడు.

vijay-srileela-out-from-vd12

ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ లో నటిస్తున్నాడు విజయ్. ఈ మూవీ తర్వాత జెర్సీ మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో మరో మూవీ చేయబోతున్నాడు. అయితే తాజాగా ఈ మూవీ గురించి షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. గౌతమ్ తో చేసే ఈ సినిమా విజయ్ దేవరకొండకు 12వ సినిమా. దీంతో దీనికి వర్కింట్ టైటిల్ వీడీ12 అని పెట్టారు. అలాగే ఈ మూవీలో ముందుగా హీరోయిన్ గా టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరోయిన్, శ్రీలీలను తీసుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ నుంచి అమ్మడు తప్పుకున్నట్లు తెలుస్తోంది. అందుకు ఫ్యామిలీ స్టార్ మూవీ కారణమని టాక్ వినిపిస్తోంది.

vijay-srileela-out-from-vd12

గీతాగోవిందం మూవీ డైరెక్టర్ పరుశురాం ఫ్యామిలీ స్టార్ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తుండగా సీతారామమ్ ఫేమ్ మృణాల్ హీరోయిన్ గా కనిపించనుంది. ప్రముఖ టాలీవుడ్ ప్రొడ్యూజర్ దిల్ రాజ్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అయితే ఫ్యామిలీ స్టార్ మూవీ పూర్తికాగానే VD12 షూట్ స్టార్ట్ చేయాలని మేకర్స్ భావించారు.కానీ సీన్ రివర్స్ అయ్యింది. ఇప్పటికీ ఫ్యామిలీ స్టార్ మూవీ షూటింగ్ పూర్తికాలేదు. ఈ క్రమంలో ఫ్యామిలీ స్టార్ పూర్తైన తర్వాతే VD12 చేద్దామని విజయ్ చెప్పడంతో డైరెక్టర్ గౌతమ్ కూడా ఓకే అన్నాడట. అయితే షూటింగ్ ఆలస్యం అవడంతో.. శ్రీలీల తన డేట్లను అడ్‎జస్ట్ చేసుకోలేక పోతోందట. అందుకే VD12 నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మేకర్స్ కూడా ఓకే చెప్పడంతో ఇప్పుడు రెండో హీరోయిన్ కోసం వేట మొదలైంది. ఈ క్రమంలో యానిమల్ మూవీ బ్యూటీ తృప్తి దిమ్రిని తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట. యానిమల్ లో తృప్తి తన యాక్టింగ్ తో అదరగొట్టింది. ఈ ఒక్క మూవీతో అమ్మడికి ఓ రేంజ్ పాపులారిటీ వచ్చింది. సోషల్ మీడియాలోనూ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఈ క్రమంలో ఆమెనే విజయ్ సినిమాలో రెండో హీరోయిన్ గా తీసుకోవాలని మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారట. తృప్తి కూడా ఓకే చెబితే రౌడ్ బాయ్ జోడీగా ఈ ముద్దుగుమ్మను మనం చూడవచ్చు.

Sri Aruna Sri

Recent Posts

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

1 week ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

2 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

2 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

2 weeks ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

2 weeks ago

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…

2 weeks ago

This website uses cookies.