Brahmanandam : కామెడీ కింగ్ బ్రహ్మానందం తన కామిక్ సెన్స్ తో ఇండస్ట్రీలో కొన్ని దశాబ్దాలుగా ఏలుతున్నాడు. అప్పట్లో టాప్ హీరోల సినిమాలు కూడా బ్రహ్మానందం కోసం వెయిట్ చేసేవంటే అతిషయోక్తి కాదేమో. బ్రహ్మానందం మంచి కమెడీయనే కాదు అద్భుతమైన కళాకారుడు. కుంచె పట్టి బొమ్మ గీస్తే దానికి ప్రాణం రావాల్సిందే. ఆయనకు రచనలోనూ మంచి అనుభవం ఉంది. తాజాగా బ్రహ్మానందం నేను –మీ బ్రహ్మానందం అనే బుక్ రాశారు. తన ఆత్మ కథను తానే ఈ పుస్తకం రూపంలో రాసినట్లు తెలుస్తోంది. ఈ మధ్యనే ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ పుస్తకంలో ఆయన గురించి తెలియని ఎన్నో విషయాలు నిక్షిప్తమై ఉన్నాయి. తన జీవితంలో ఆయన ఎదుర్కొన్న సవాళ్లు ప్రతిసవాళ్లు వ్యక్తిగత జీవితం గురించి ఆశ్చర్యానికి గురిచేసే అంశాలను ఈ పుస్తకంలో రచించినట్లు తెలుస్తోంది. చిత్ర పరిశ్రమలోకి రాకముందు చదువుకోసం ఆయన పడిన కష్టాలేంటి? తినడానికి తిండి లేక పడిన ఇబ్బందులేంటి? ఇండస్ట్రీలో ఓ స్థాయికి రావడానికి కారణం ఎవరు? ఇలా ఎన్నో విషయాలు ఆయన రాసిన పుస్తకంలో పొందుపరిచారు.. మరి ఆయన జీవిత అనుభవాలేంటో మనమూ తెలుసుకుందాం.
చిన్నప్పుడు చదువు కోసం బ్రహ్మానందం చాలా కష్టాలు పడ్డారట. అప్పుడు అనసూయమ్మ అనే ఒక టీచర్ సహాయంతో చదువుకున్నారట. ఆమె వల్లే తన జీవితం ఇలా మారిందని తాను రాశిన పుస్తకంలో వెల్లడించారు బ్రహ్మానందం. తనలోని ప్రతిభనుని చూసి దయతో టీచర్ అనసూయమ్మతో పాటు కొంతమంది చూయూతనిచ్చారనక్నారు. ఆమె చెప్పిన చదువే నన్ను ఇంతవాడిని చేసిందని తెలిపారు. పాఠశాల విద్య అనంతరం తనకు సాయం చేసిన వారి ఇళ్లల్లో చిన్న చిన్న పనులు చేస్తూ ఇంటర్ , డిగ్రీ చదువుకున్నట్లు తెలుస్తోంది. డిగ్రీ చదువుకునేటప్పుడే నాటకాలు, మిమిక్రీ వంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసేశారట.
డిగ్రీ బి.ఎ తెలుగు పూర్తి చేసిన బ్రహ్మానందం ఆతర్వాత ఎంఏ చదవడానికి ఆయన దగ్గర డబ్బులు లేవట. అప్పుడే వైజాగ్ లో ఆంధ్ర యూనివర్సిటీ గుంటూరులో పీజీ సెంటర్ ప్రారంభించడంతో అక్కడి సీటు కోసం ప్రయత్నించారట. తన ప్రతిభను కళను, కామెడీని సెన్స్ నచ్చడంతో ఎంఏ తెలుగులో ఫ్రీగా సీటు ఇచ్చారట. ఫ్రీ సీటు దొరికిందిలే అని సంతోషించేలోపు అక్కడ హాస్టల్ లో ఉండి చదువుకోవడానికి డబ్బులు లేవు. దీంతో గుంటూరులోని నల్లపాడు లో చిన్న చిన్న రూమ్స్ కట్టి విద్యార్థుల కోసం అద్దెకిచ్చే చోట ఉంటూ అనసూయమ్మ చల్లని చూపుతో చదువుకున్నారట. చదువుతో పాటు తిండికి కూడా ఆమెను అడగడం ఇష్టం లేక ఏదో ఒక పని చేద్దాం అని డిసైడ్ అయ్యారట. దీంతో తను కాలేజీకి వెళ్లేదారిలో ఒకచోట లారీల మరమ్మత్తులు చేస్తూ.. పెయింట్స్ వేసే వారట. బ్రహ్మానందం గారికి బొమ్మలు వేసే కళ ఉండటంతో ఆ పెయింట్ పనేదో బాగుందని అసిస్టెంట్ గా ఉద్యోగంలో చేరారట. కొన్ని రోజుల్లోనే తాను కూడా లారీలకు పెయింట్స్ వేయడం మొదలు పెట్టారు. ఉదయం కాలేజీకి వెళ్లడం సాయంత్రం లారీలకు పెయింట్ వేసి డబ్బు సంపాదించుకునే వారట.అలా లారీలకు పెయింట్ చేస్తూ వచ్చిన డబ్బుతో కడుపు నింపుకొనేవారట.. ఇతరులు చేసిన హెల్ప్ తో ఎంఏ పూర్తి చేసినట్లు బ్రహ్మానందం తన పుస్తకంలో తెలిపారు.
Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ జీనియస్ శంకర్ షణ్ముగ్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘గేమ్ ఛేంజర్’.…
Tollywood Exclusive: 2000 సంవత్సరం తర్వాత నటుడు, నిర్మాత అశోక్ కుమార్ తన బ్యానర్ లో ఒక సినిమాకు శ్రీకారం…
The Rana Daggubati Show Trailer: త్వరలో పాపులర్ ఓటీటీ అమెజాన్ ప్రైం లో టాలీవుడ్ టాల్ హీరో అయిన…
Bhagyashri Borse: తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. మాస్ మహారాజా రవితేజ-డైరెక్టర్ హరీశ్ శంకర్…
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
This website uses cookies.