BJP: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా తన ప్రస్థానం మరింత విస్తృతం చేసుకునే ప్రయత్నం చేస్తుంది కేవలం ఒక్క స్థానంతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన బిజెపి పార్టీ ఎప్పుడు దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలకు విస్తరించింది. త్రిపుర, నాగాలాండ్ మేఘాలయ రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో మేఘాలయ తప్ప మిగిలిన రెండు రాష్ట్రాల్లో బిజెపి కూటమి అధికారంలోకి వచ్చింది. త్రిపుర ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీలకు గండికోడుతూ బిజెపి అధికారాన్ని సొంతం చేసుకోవడం సంచలనం అని చెప్పాలి. క్రైస్తవ ఆదివాసీలు ఎక్కువగా ఉండే ఈశాన్య రాష్ట్రాలలో మతతత్వ పార్టీగా ముద్ర వేసుకున్న బిజెపి అధికారంలోకి రావడం వెనుక వారి బలమైన వ్యూహాలు ఉన్నాయని చెప్పాలి.
కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలతో కలిపి జతకట్టి బిజెపిని ఓడించే ప్రయత్నం చేసిన కూడా వారి పాచికులు పారలేదు. మూడు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. మోడీ సారథ్యంలోని బిజెపి పార్టీ ఈశాన్య భారతంలో కూడా కమలం జెండా ఎగరేసింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కూడా ఈశాన్య భారతంలో విస్తృతంగా కార్యకలాపాలు చేస్తూ ఆదివాసీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వారిని చైతన్యపరిచే ప్రయత్నం చేసింది. అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో ప్రజలు ఎక్కువగా మాంసాహారులుగా ఉంటారు. ఈ నేపథం కొద్దిగా బీజేపీ మతతత్వ విధానాలను విడిచిపెట్టిందని చెప్పాలి. ఒకప్పుడు ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకులుగా ఉన్నవారు ప్రస్తుతం బిజెపికి ఈశాన్య రాష్ట్రాల్లో బలంగా మారారు.
కాంగ్రెస్ అధిష్టానం వైఖరులతో విసిగిపోయిన ఆ నాయకులు బిజెపిలోకి వచ్చి స్వేచ్ఛగా తమ వ్యూహాలను అమలు చేశారు. అలా వచ్చిన వారిలో ప్రస్తుతం అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు, మణిపూర్ ముఖ్యమంత్రి బీరన్ సింగ్, కాంగ్రెస్ పార్టీలో ఇమడలేక బిజెపిలోకి వచ్చి ముఖ్యమంత్రిగా ఎదిగిన వారు. క్రైస్తవ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న నాగాలాండ్ లో కూడా ప్రస్తుతం బిజెపి అధికారంలోకి రావడం విశేషం. దీన్ని బట్టి మోడీ ప్రభావం ఆయా రాష్ట్రాల్లో ఏ విధంగా ఉందనేది చెప్పొచ్చు. ఇక వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ బాగా వేసేందుకు సిద్ధమవుతుంది. ఆ దిశగా బలమైన వ్యూహాలను సిద్ధం చేసుకుంటుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.