Janasena-BJP: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో 2024 ఎన్నికల లక్ష్యంగా అన్ని పార్టీలు ఎవరికి వారుగా ప్రణాళికలు చేసుకుంటున్నారు. గెలుపు వ్యూహాలు సిద్ధం చేసుకుని ప్రజాక్షేత్రంలోకి ఇప్పటికీ అధికార పార్టీ వైసిపి ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలు వెళ్లిపోయాయి. ఇంకా మూడవ ప్రత్యామ్నాయంగా ఉన్న జనసేన పార్టీ మాత్రం పొత్తుల వ్యూహాలతో, కమలంతో కుస్తీలు పడుతూ ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓవైపు వరుసగా సినిమా షూటింగ్ లు పెట్టుకుని బిజీగా ఉన్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా అధికారంలో భాగస్వామ్యం కావాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే తమతో పొత్తులో ఉన్న బిజెపి పార్టీని కూడా వెంట తీసుకొచ్చేందుకు సంప్రదింపులు జరుపుతున్నారు. గత నెలలో ఢిల్లీ వెళ్లి బిజెపి పెద్దలతో పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా చర్చించారు.
అయితే ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ దృష్టి మొత్తం కర్ణాటక ఎన్నికలపై ఉంది. ఈసారి కర్ణాటక ఎన్నికలలో మళ్ళీ అధికారంలోకి రావాలని భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తుంది. దానికోసం ఉన్న అన్ని మార్గాలను వెతుకుతోంది. ఇప్పటికే కన్నడ స్టార్ సుదీప్ భారత జనతా పార్టీ తరఫున క్యాంపెయిన్ చేయడానికి ఒప్పుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులో ఉన్న నేపథ్యంలో అతనిని కూడా కర్ణాటక ఎన్నికలలో స్టార్ క్యాంపైనర్ గా ఉపయోగించుకోవాలని భావిస్తుంది. ఇప్పటికే కర్ణాటకలో బిజెపి యువ నాయకుడుగా ఉన్న తేజస్వీ సూర్య పవన్ కళ్యాణ్ తో కలిసి దీనిపై మంతనాలు చేయడం జరిగిందని సమాచారం.
ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ కేంద్రంలోని పెద్దలతో చర్చించడం కూడా జరిగింది. 2014 కాంబినేషన్ రిపీట్ చేద్దామని పవన్ కళ్యాణ్ వారిని కోరినట్లుగా టాక్. అయితే కర్ణాటక ఎన్నికల తర్వాత తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ చేద్దామని వారు సూచించినట్లుగా రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది. పొత్తుల పైన కూడా అప్పుడు నిర్ణయాలు తీసుకుందామంటూ దాటవేశారంట. అలాగే కర్ణాటక ఎన్నికలలో బిజెపి తరఫున ప్రచారం చేయాలని కోరినట్లుగా సమాచారం. అయితే పవన్ కళ్యాణ్ దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం బిజెపి పెద్దలకు చెప్పలేదని తెలుస్తోంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ కర్ణాటక ఎన్నికలలో ప్రచారం చేయడం ద్వారా అధికారంలోకి వస్తే అప్పుడు ఏపీలో బీజేపీ కూడా పవన్ కళ్యాణ్ సూచించిన దారిలో పెళ్లి అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు సాధ్యం అవుతుంది అనేది వేచి చూడాలి.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.