Nidhhi Agerwal: ఇస్మార్ట్ బ్యూటీ నిధీ అగర్వాల్ కెరీర్‌లో చేదు అనుభవం ఒకటుంది. కెరీర్ ప్రారంభంలో ఆడిషన్ కి వెళితే ప్రైవేట్ పార్ట్స్ చూపించు అన్నాడట ఆ సినిమా దర్శకుడు. ఈ విషయాన్ని ఇన్నాళ్లకి అమ్మడు బయటపెట్టింది. పక్కా హైదరాబాదీ అయిన నిధీ అగర్వాల్ 2017లో విడుదలైన ‘మున్నా మైఖేల్’ అనే హిందీ సినిమాతో హీరోయిన్‌గా బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.
ఈ సినిమాతో అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకుంది. దాంతో తెలుగులో అక్కినేని నాగచైతన్య హీరోగా రూపొందిన ‘సవ్యసాచి’ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం అందుకుంది. ఈ సినిమాతో ఇటు తెలుగు ప్రేక్షకులలోనూ బాగానే గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత అఖిల్ సరసన మిస్టర్ మజ్ఞు చేసింది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.
కానీ, నిధీకి మాత్రం గ్లామర్ బ్యూటీగా మంచి క్రేజ్ దక్కింది. దాంతో పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో ఛాన్స్ రావడం అది బ్లాక్ బస్టర్ కావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇస్మార్ట్ బ్యూటీగా ఇంకాస్త క్రేజ్ దక్కించుకోవడం జరిగిపోయాయి. అలాగే తమిళంలోనూ అడుగుపెట్టి రెండు భారీ హిట్స్ అందుకుంది. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హరి హర వీరమల్లు సినిమాలో నటిస్తోంది.
కాగా, ఇటీవల మీడియాకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకి ఎదురైన ఓ చేదు అనుభవం గురించి మాట్లాడింది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఒకరు హీరోయిన్‌గా ఛాన్స్ ఇస్తా అని ఆడిషన్ కి పిలిచాడట. ఆడిషన్ కి వెళ్ళిన నిధిని నీ ప్రైవేట్ పార్ట్స్ చూపించు..అని అడిగాడట. అది నచ్చక అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు తెలిపింది. దాదాపు చాలామంది హీరోయిన్స్ కి ఈ అనుభవం ఎదురవుతుంది. కానీ, నిధీ మాదిరిగా ఓపెన్ అయ్యేవారు చాలా తక్కువమందే.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.