Bigg Boss 7 : బాలీవుడ్ లో సూపర్ సక్సెస్ అయిన బిగ్ బాస్ రియాలిటీ షో మన తెలుగులోనూ బాగా క్రేజ్ సంపాదించుకుంది. తమిళంలో కూడా బాగా ఆదరణ దక్కించుకుంది. అక్కడ కమల్ హాసన్ ఇప్పటివరకూ హోస్ట్‌గా వ్యవహరించారు. ఇక మన తెలుగులో మొదటి సీజన్‌కి యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ రెండవ సీజన్‌కి నేచురల్ స్టార్ నాని హోస్ట్‌లుగా వ్యవహరించారు. ఆ తర్వాత మూడవ సీజన్ నుంచి కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తూ వచ్చారు. అంతేకాదు, ఆయనకి సంబధించిన అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్‌లో సెట్స్ వేసి షో రన్ చేశారు.
అయితే, గత నాలుగు సీజన్స్ నుంచి ప్రేక్షకులు నాగార్జునని చూసి విసిగిపోయారట. హోస్ట్ చేసే విధానం కూడా బాగా బోర్ కొట్టినట్టు టాక్ వినిపిస్తోంది. ఇక మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే హైదరాబాద్‌లో షూట్ జరగడం వల్ల ఒకరోజు ముందే హౌజ్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో కూడా లీకై షో మీద ఆసక్తి తగ్గిపోయింది. ఇది గత సీజన్‌లో బాగా తెలిసింది.
దాంతో టీఆర్పీ రేటింగ్ కూడా బాగా తక్కువ నమోదు అయింది. అందుకే, ఈ సారి బిగ్ బాస్ సీజన్ 8 ని చెన్నైలో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు, ఈ సీజన్‌కి హోస్ట్ కూడా నాగార్జునని కాదని సమాచారం. టెలివిజన్ రియాలిటీ షోలో నంబర్ 1 యారీ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ షో సీజన్స్ కి హోస్ట్‌గా వ్యవహరించింది దగ్గుబాటి రానా.
ఆయనే ఇప్పుడు బిగ్ బాస్ 7 కి హోస్ట్‌గా నిర్వాహకులు ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. రానా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడంలో మంచి పేరు తెచ్చుకున్నారు. అందుకే, స్టార్ మా బృందం త్వరలో మొదలుపెట్టబోయో బిగ్ బాస్ 1కి రానాని హోస్ట్‌గా ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది. మరి దీనిలో నిజమెంత ఉందో మేకర్స్ నుంచి అఫీషియల్ కన్‌ఫర్మేషన్ వస్తే గానీ తెలియదు.
ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…
Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…
Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…
Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…
This website uses cookies.