Spiritual: హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించే దేవుళ్లలో విష్ణువు ఒకరు. హిందూ మత సాంప్రదాయ ప్రకారం త్రిమూర్తులుగా కొలువబడే ముగ్గురు ప్రధాన
దేవుళ్లలో విష్ణువు ఒకరు. హిందూ మతానుసారం సృష్టికి సంరక్షకుడు, రక్షకుడు మహా విష్ణువు. ఆయన సర్వ శక్తిమంతుడు, సర్వస్వం వ్యాపించినవాడు. పురాణాల ప్రకారం 22 సార్లు పునర్జన్మ పొందాడు మహా విష్ణువు. అందులో సృష్టిని రక్షించడానికే 10 జన్మలను ఎత్తేడు. నరసింహుని పురాణం విష్ణువు
సర్వవ్యాప్తి అని చెప్పడానికి ఉదాహరణగా నిలుస్తుంది. కృష్ణుని రూపంలో భగవంతుడు కర్మయోగం ప్రాముఖ్యత ఏమిటో తెలిపాడు.
విశ్వం మొత్తాన్ని తన జ్ఞానంతో చూడగల దైవం వైష‌్ణవుడు. అనంతనాగ మంచం మీద నిద్రిస్తూనే రాక్షసుల బారి నుంచి విశ్వాన్ని రక్షిస్తుంటాడు. భారతదేశంలో అనేక వైష్ణవ దేవాలయాలు ఉన్నాయి. వీటిలో కొన్ని ఆలయాలు విష్ణువు పేరులో కాకుండా అతని విభిన్న పునర్జన్మ రూపాల పేరుతో ఉన్నాయి. హిందూ మతంలో, విష్ణువు నీలిరంగు రంగు కలిగి ఉంటాడు. తన నాలుగు చేతులలో శంఖు, చక్ర, గద, పద్మాలను కలిగి ఉన్నాడు. విష్ణువు వాహనం గరుడుడు, భార్య మహాలక్ష్మి.
వైష్ణవులలో వివిధ వర్గాలు ఉన్నాయి. అందరూ శ్రీమహావిష్ణువును ఆరాధించేవారే , కానీ ఒక్కొక్కరు ఒక్కో విధంగా విష్ణువుకు పూజలు చేస్తుంటారు. హిందూ మతం యొక్క ప్రత్యేకత ఏమిటంటే రెండు పూజా విధానాలు వాడుకలో ఉన్నాయి. ఒకటి దేవునికి నిన్ను నువ్వు అర్పించుకోవడం మరొకటి లోతైన భక్తితో కూడిన నిశ్శబ్ద ప్రార్థనతో స్వామిని ఆరాధించడం. అందుకే భగవంతుడిని పూర్తి భక్తితో ప్రార్థించి , అంతరంగాన్ని శుభ్రపరచడానికి అతని నామాన్ని జపించాలి.
విష్ణువుపై ఆధారపడిన పండుగలు :
శ్రీమహావిష్ణువు మహిమను గుర్తుచేసుకోవడానికి అనేక పండుగలు ఉన్నాయి. వాటిలో కొన్ని చాతుర్మాస, జన్మాష్టమి, గోకుల-అష్టమి, రామనవమి, అక్షయతృతీయ, దత్తజయంతి, దేవ్ దీపావళి ఇలా చాలా రకాల పండుగలను ఏడాది పొడవునా జరుపుకుంటూ విష్ణువున్ని ఆరాధిస్తుంటారు.
విష్ణువును పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు :
హిందూ మతంలో, మతపరమైన ఆరాధన అనేది అంతర్గతంగా ఏర్పడిన మురికిని శుభ్రపరచడానికి అనుసరించే ఒక మార్గం. విష్ణు భగవానుని ఆరాధించడానికి ఉత్తమ మార్గం ఏమిటంటే, విష్ణువు ఎదుట ఎటువంటి కోరిక లేకుండా ప్రార్థించడం. భగవంతుడే భక్తుని కోరిక తెలుసుకుని తీరుస్తాడు. శ్రీమహావిష్ణువును పూజించడం వల్ల శాంతి, విముక్తి లభిస్తుంది.
విష్ణువును పూజించే ప్రాంతాలు :
ప్రపంచ వ్యాప్తంగా వైష్ణవ ఆరాధకులు ఉన్నారు. అన్ని వేళలా భక్తులు భక్తి శ్రద్ధలతో ఆయన్ను పూజిస్తుంటారు. వేల కోట్ల నామాలు ఉన్నా ప్రధానంగా విష్ణువు, కృష్ణుడు, వేంకటేశ్వరుడు ఇలా అనే పేర్లతో పూజింపబడుతున్నాడు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.