Health: వేసవి వచ్చింది అంటే మామిడి పండ్ల సీజన్ మొదలవుతుంది. పల్లెల నుంచి పట్టణాల వరకు ప్రతి చోట మామిడి పండ్లు విరివిగా లభిస్తూ ఉంటాయి. పూర్వం రోజులలో పల్లెల్లో మామిడి తోటల వేసవి సీజన్ లో లభించే మామిడి పండ్ల ని కుటుంబం మొత్తం తినేవారు. అయితే ఇప్పుడు మామిడి పండ్ల వ్యాపారం అనేది ఒక లాభసాటి వ్యాపారాలలో ఒకటిగా మారింది.
ఈ కారణంగా రైతులు ఇతర వ్యవసాయాల కంటే తమ భూమిలో మామిడి మొక్కలు వేసి సీజనల్ గా వచ్చే మామిడి పండ్లని అమ్ముకొని దానితో ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. అయితే అన్ని సమయాలలో ఈ మామిడి పండ్ల వ్యాపారం రైతులకి కలిసి రాదు. మామిడి కాయలు చేతికి వచ్చే సమయానికి తుఫాన్ లు వంటివి వస్తే పంట పూర్తిగా నాశనం అయ్యే అవకాశం ఉంది. అయితే ఏ సీజన్ లో అయిన సిటీలలో మామిడి పండ్లు కిలో వంద రూపాయిల వరకు ధర పలుకుతుంది. చాలా మంది వేసవికాలంలో కొనుక్కొని ఇష్టంగా తింటారు.
అయితే మామిడి పండ్లు ఎక్కువగా తింటే వేడి చేస్తుందని, శరీరంలో ఇన్ఫెక్షన్ కురుపులు వస్తాయని చాలా మంది భావిస్తూ ఉంటారు. అయితే ఈ మామిడి పండ్లలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. పండ్లలో మామిడిని రారాజుగా పిలుస్తారు. వీటిలో విటమిన్స్, మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. మామిడి పండ్లలో ముఖ్యంగా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ విధానాన్ని మెరుగుపరిచి ఆహారం తొందరగా జీర్ణం అవడానికి ఉపయోగపడుతుంది.
అలాగే వీటిలో ఉండే గ్లైసెమిక్స్ ఇండెక్స్ కారణంగా షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి. విటమిన్ సి కూడా ఉండటం వలన కొలెస్టరాల్ ని నియంత్రిస్తుంది. అలాగే క్యాన్సర్ కారకాలని మామిడి పండ్లు ఎదుర్కోవడంతో పాటు ప్రోటో క్యాన్సర్ ఆంకోజీన్స్ ని నివారించే సామర్ధ్యం ఎక్కువగా ఉంటుంది. అలాగే లుకేమియాని ఎదుర్కొనే శక్తి మామిడి పండ్లకి ఉంటుంది. అలాగే మామిడి పండ్లు తినడం వలన దంత సమస్య దూరం అవుతుంది. నోట్లో ఉండే బాక్టీరియాని నాశనం చేసే లక్షణం ఈ పండ్లకి ఉంది. ఎలాంటి పంటి సమస్యలు ఉన్నవారైనా మామిడి పండ్లు తింటే ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
అలాగే వీటిలో రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం చాలా వరకు మామిడి పండ్లని కెమికల్స్ వేసి మగ్గిస్తున్నారు. వీటిని తినడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు సరికదా కొత్త జబ్బుల్ని ఆహ్వానించినట్లు అవుతుంది. సహజసిద్ధంగా మగ్గించిన మామిడి పండ్లలో మాత్రమే ఔషధ గుణాలు అన్ని ఉంటాయని నిపుణుల మాట.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.