Health: ప్రస్తుతం రోజువారీ జీవితాలు చాలా క్లిష్టతరంగా మారిపోయాయి. బ్రతుకు పోరాటంలో మనం క్షణం తీరిక లేకుండా పరుగులు పెడుతున్నాం. సమయానికి భోజనం, సమయానికి నిద్ర అనేది మరిచిపోయి చాలా కాలం అవుతుంది. బయటకి వెళ్తున్న జనం ఎక్కడో ఓ చోట, దొరికినదేదో తినేస్తూ ఆ సమయానికి కడుపు నింపుకుంటున్నారు. అయితే ఈ ప్రయాణంలో శారీరక ఆరోగ్యాన్ని చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. అలాగే చిన్న వయస్సు నుంచే చాలా మంది జంక్ ఫుడ్స్ కి అలవాటు పడుతున్నారు. ఈ కారణంగా శరీరంలో కొలెస్థ్రాల్ పెరిగిపోయి ఊబకాయం వంటివి వస్తున్నాయి. అలాగే శరీరంలో అధిక కొవ్వు ఎక్కువై వయస్సుకి మించిన రూపం కనిపిస్తుంది. ఆహార నియమాలు పూర్తిగా గాడితప్పడంతో కొత్త కొత్త ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ కారణంగానే చిన్న వయస్సులోనే గుండెపోటు, షుగర్, క్యాన్సర్ వంటివి సంక్రమిస్తున్నాయి.
ఇవన్నీ పెరగడానికి మన రోజువారీ ఆహారపు అలవాట్లు ప్రధాన కారణం అని చాలా మంది గుర్తించరు. గుర్తించి డాక్టర్లు సలహాలు తీసుకునే సమయానికి రావాల్సిన రోగాలన్నీ ఒంట్లోకి వచ్చి తిష్ట వేస్తాయి. ఇక వాటిని వదిలించుకోవడానికి రోజు రకరకాల మందులు వాడుతూ ఉండాలి. అలాగే ఆపరేషన్స్ చేయించుకోవాల్సిన పరిస్థితుల్లోకి వచ్చేస్తున్నాము. అయితే మన పూర్వీకులు గ్రామీణ ప్రాంతాలలో మంచి ఆహారపు అలవాట్లు, సరైన జీవన విధానంతో ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా వందేళ్లు బ్రతికేవారు. ఇవన్నీ అర్ధం చేసుకున్న ప్రజలు ఇప్పుడిప్పుడు మరల మన గతకాలపు అలవాట్లు మళ్ళీ తిరిగి చేసుకోవడం మొదలు పెట్టారు. మన వంటింట్లో ఉపయోగించే పదార్ధాలతోనే ఒంట్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చనే విషయాన్ని తెలుసుకున్నారు. ఇలాంటి వంటింటి చిట్కాలు చాలా ఉన్నాయి. వాటిలో అల్లం, నిమ్మరసం, తేనె కాంబినేషన్ లో చేసుకునే టీ కూడా ఒకటి. ఇప్పుడంటే చాలా మంది కాఫీ, టీ పౌడర్లుకి అలవాటు పడ్డారు కానీ.
పూర్వం మాత్రం అల్లం రసాన్ని ప్రతి రోజు ఉదయాన్నే తాగేవారు. ఇది శరీరానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉండి అధిక బరువు ఉన్నవారు అల్లం, నిమ్మరసం నీటిలో కలిపి గోరువెచ్చగా వేడి చేసి దానిలో తేనె లేదా బెల్లం మిశ్రమాన్ని కలుపుకొని తాగడం వలన ఎంతో ఉపయోగం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. నిమ్మరసం నేచురల్ డిటాక్సిఫయర్ గా పనిచేసి కొలెస్ట్రాల్ ని కరిగిస్తుంది. అలాగే వీటిలో విటమిన్స్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఫైబర్ వంటి పోటీన్స్ ఉండటం వలన శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే జీర్ణ సంబంధ సమస్యలని కూడా ఈ ద్రవం పోగొడుతుంది. శరీరానికి హానికరం అయిన కొవ్వుని పోగొట్టడం త్వరగా బరువు తగ్గడానికి ఎంతో ఉపయోగపడుతుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.