Vastu Tips: మన హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం తులసి మొక్కను ఎంతో పవిత్రమైనదిగా భావిస్తాము తులసి మొక్కను పూజించడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవిని పూజించినట్లేనని భావిస్తారు తులసి లక్ష్మీ స్వరూపంగా పరిగణిస్తారు. అందుకే ప్రతి ఒక్క ఇంటి ఆవరణంలోనూ తులసి మొక్కను పెట్టడం మనం చూస్తుంటాము. ఇలా తులసి మొక్కకు ప్రతిరోజు పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై కలుగుతుందని భావిస్తారు. అయితే మనకు ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆర్థిక అభివృద్ధి కలగాలి అంటే తులసి ఆకులతో ఈ చిన్న పరిహారం చేస్తే లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు మనపై ఉంటాయి.
తులసి ఆకులతో ఈ చిన్న పరిహారం చేయడం కోసం 11 తులసి ఆకులను తీసుకొని శుభ్రంగా కడగాలి.
పగటిపూట 11 పచ్చి తులసి ఆకులను ఎంచుకొని కడిగి ఎండలో ఆరబెట్టాలి. సింధూరంలో ఆవాల నూనె కలిపి తులసి ఆకులపై రామనామాన్ని రాయాలి. ఆ ఆకులతో మాల తయారుచేసి ఆంజనేయుడికి సమర్పించాలి. ఇలా ఆంజనేయుడుకి తులసిమాలను సమర్పించడం వల్ల ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవు.
ఇక జేబులో రూపాయి లేకుండా ఆర్థిక సమస్యలతో బాధపడేవారు తులసి ఆకులను ఎరుపు రంగు వస్త్రంలో కట్టి మీ పర్సు లేదా డబ్బులుంచే అల్మారాలో పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ధన ప్రవాహం పెరిగి కుటుంబానికి ధన వర్షం కురుస్తుంది. మన ఇంట్లో ప్రతికూల శక్తి ఎక్కువగా ఉన్నట్లయితే ఐదు తులసి ఆకులను తీసుకొని ఒక ఇత్తడి గిన్నెలో నీటిని పోసి తులసి ఆకులను వేయడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూల శక్తి మొత్తం తొలగిపోయి అనుకూల శక్తి ఏర్పడుతుంది. ఇలా ఇంటి మొత్తం పాజిటివ్ ఎనర్జీని కలిగించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తుంది.
Anil Ravipudi: మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కీర్తి సురేష్ మంచి సక్సెస్‌లను అందుకున్న సంగతి తెలిసిందే. నేను శైలజ…
Balakrishna: టాలీవుడ్ సీనియర్ హీరో నట సింహం నందమూరి బాలకృష్ణకు మరో అరుదైన అవార్డు దక్కింది. తెలుగు చలన చిత్ర…
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో పాన్ వరల్డ్ చిత్రంగా…
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతీ ఒక్కరిలో ఉండే ఆతృత, ఆసక్తి ఊహించలేనిది. ఎన్ని సినిమాలు బాక్సాఫీస్…
*బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు *ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక Kadiri Narasimha Swamy: కదిరి, మార్చి…
Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…
This website uses cookies.