Balakrishna: రాజకీయాల సంగతి ఏమోగానీ ఈ మధ్యకాలంలో బాలకృష్ణ ఏం మాట్లాడినా కూడా దానిని వైసీపీ సోషల్ మీడియా వివాదంగా మార్చే ప్రయత్నం చేస్తుంది. జనవరి నెలలో బాలకృష్ణ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వీర సింహారెడ్డి సినిమాలో ఒక కులాన్ని కించపరిచే విధంగా సంభాషణలు ఉన్నాయంటూ తీసుకొచ్చారు. దానిపై కొద్ది రోజులు చాలా హడావిడి చేశారు. అయితే ఆ అంశంపై బాలకృష్ణ స్పందించి కించపరిచే విధంగా సంభాషణలు ఉంటే క్షమించాలని కోరారు. దీంతో ఆ వివాదం ముగిసింది. అయితే తాజాగా అన్ స్టాపబుల్ సీజన్ 2 లో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్లో బాలకృష్ణ సందర్భోచితంగా తనకు రోడ్డు ప్రమాదం జరిగిందని ఆ సమయంలో ఓ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకున్నాను అక్కడే ఉన్న నర్స్ తనకి ప్రమాదం జరిగిన విషయం చెప్పిందని చెప్పారు.
అయితే ఆ నర్సుని ఉద్దేశించి చాలా అందంగా ఉంది అంటూ కామెంట్ చేశారు. అయితే ఇప్పుడు ఈ అంశాన్ని వివాదంగా మార్చి నర్సులను ఉద్దేశించి బాలకృష్ణ తప్పుగా మాట్లాడారని సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా వైసిపి సోషల్ మీడియా టీం రచ్చ చేస్తుంది. ఇక కొంతమంది నర్సుల అసోసియేషన్ అనుకుంటూ ముందుకు వచ్చి బాలకృష్ణకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ వీడియోలు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉన్న తాజాగా బాలకృష్ణ ఈ అంశంపై ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు. తన మాటలను వక్రీకరించి ఒక వర్గం మీడియా కావాలనే దుష్ప్రచారం చేసిందని బాలకృష్ణ పేర్కొన్నారు.
రోగులకు సేవలు అందించే నర్సులను సోదరి సమానులుగా చూస్తానని, వారిపై తర్కి చాలా గౌరవం ఉందని బాలకృష్ణ పేర్కొన్నారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో నర్సులు చేస్తున్న సేవలను ప్రత్యక్షంగా చూసినవాడిగా వారి మీద తనకే ఎంతో గౌరవం, కృతజ్ఞత భావం ఉందని బాలకృష్ణ పేర్కొన్నారు.బి కరోనా కష్టకాలంలో కూడా నర్సులు రాత్రి పగలు అనకుండా సేవలు చేశారని కొనియాడారు. తన మాటలు ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించాలని ఈ పోస్ట్ లో పేర్కొన్నారు. దీంతో నర్సుల వివాదానికి బాలకృష్ణ పుల్ స్టాప్ పెట్టినట్లు అయింది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.