Balagam Movie: కమెడియన్ వేణు దర్శకత్వంలో దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి వచ్చిన చిన్న చిత్రం బలగం. ప్రియదర్శి తప్ప చెప్పుకోదగ్గ స్టార్ క్యాస్టింగ్ ఈ సినిమాలో లేరు. అయినా కూడా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ని రాబట్టడం విశేషం. ఈ మూవీ కలెక్షన్స్ 20 కోట్లకి చేరువ అవుతున్నాయి. కేవలం రెండు కోట్ల లోపు బడ్జెట్ తో తీసిన మూవీకి గట్టిగా ప్రమోషన్ చేయకపోయిన కూడా మౌత్ టాక్ తో ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యి అద్భుతమైన కలెక్షన్స్ ని రాబట్టడం అద్భుతం అని చెప్పాలి. చిన్న సినిమాలలో అతి పెద్ద విజయాన్ని బలగం సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా చూసిన తర్వాత ఈ జెనరేషన్ దర్శకులు అందరూ కూడా చాలా విషయాలని నేచుకోవాలి అని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
చాలా మంది యువ దర్శకులు ఈ మధ్యకాలంలో కొత్త కథలు అంటూ ఏవేవో ప్రయోగాలు చేస్తున్నారు. లేదంటే కమర్షియల్ సినిమా అంటూ ఎలివేషన్స్ తో కథలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ రెండు ప్రయోగాలు ఎక్కువగా ఫెయిల్ అవుతున్నాయి. దీనికి కారణం ప్రేక్షకులు వారు చెప్పే సినిమాలకి ఎమోషనల్ గా కనెక్ట్ కాకపోవడమే. ఎప్పుడైనా ఒక మూవీ సక్సెస్ ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే ఎమోషనల్ ఎలిమెంట్స్ సినిమాలో ఏం ఉన్నాయి అనే దానిబట్టి డిసైడ్ అవుతుంది. మన ఇళ్ళల్లో ప్రతి రోజు చూసే కథని, అందరికి తెలిసిన కథనే చెప్పిన కూడా దానిని ఎమోషనల్ గా ఎటాచ్ చేస్తూ చెప్పడంలోనే దర్శకుడి ప్రతిభ ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో వేణు సూపర్ సక్సెస్ అయ్యాడని చెప్పాలి.
బలగం సినిమా గొప్ప కథ అయితే కాదు, అలాగే కమర్షియల్ ఎలివేషన్స్ ఏమీ లేవు. నిజాయితీగా ఒక మంచి కంటెంట్ ని గ్రామీణ ప్రాంతంలో ప్రజల అమాయకత్వంలో హాస్యాన్ని, అలాగే వారి కోపాలలో భావోద్వేగాల్ని కరెక్ట్ గా చూపించాడు. దీంతో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. అందుకే కథని నమ్ముకొని, ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యే ఎమోషనల్ ఎలిమెంట్స్ ని బలంగా సినిమాలో చూపిస్తే కచ్చితంగా బడ్జెట్ తో సంబంధం లేకుండా సినిమా సక్సెస్ అవుతుంది. ఒక కేజీఎఫ్ సిరీస్ సక్సెస్ అయ్యింది అంటే దానికి కారణం ఎలివేషన్ షాట్స్ అస్సలు కాదు. అందులో తల్లి, కొడుకుల ఎమోషన్ అని ఎవరిని అడిగిన చెబుతారు. అలాగే కాంతారా సినిమాలో ప్రేక్షకులు కనెక్ట్ అయిన పోయింగ్ అంటే దైవం, ప్రకృతి సంబంధమైన బాండింగ్ అని చెప్పాలి. కథలో ఆ సోల్ ఉంటే కచ్చితంగా సక్సెస్ అవుతుంది. అది మిస్ అయినపుడు రాధేశ్యామ్ లాంటి సినిమా అయిన డిజాస్టర్ అవుతుంది. దీనిని అర్ధం చేసుకుంటే మంచి సినిమాలు టాలీవుడ్ లో మరిన్ని భవిష్యత్తులో వస్తాయని చెప్పొచ్చు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.