Categories: LatestNews

Today Horoscope : ఈ రాశి వారు ఈ రోజు ఓ శుభవార్త వింటారు

Today Horoscope : సోమవారం 20-03-2023 రోజున 12 రాశులలో ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది. ఎవరికి ఈ రోజు కలిసి వస్తుంది. ఎవరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ఎలాంటి కార్యక్రమాలు చేప్పటవచ్చు వంటి వివరాలను ఇప్పుడు చూద్దాం.
today-horoscope-monday-20-03-2023
మేషం :
ఈ రాశి వారికి ఈ రోజు సానుకూల వాతావరణ ఏర్పడుతుంది. శారీరక శ్రమ పెద్దగా ఉండదు. శరీర సౌఖ్యం లభిస్తుంది. బంధుమిత్రులతో ఈరోజు శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతోషంగా గడుపుతారు అదే విధంగా తోటి వారి సహాయ సహకారాలతో మీ మీ రంగంలో వృద్ధిని సాధిస్తారు. మీ ప్రతిభను గుర్తించి పెద్దల నుంచి ప్రశంసలను పొందుతారు. ఆంజనేయ స్వామి స్తోత్రం ఈరోజు పాటించడం వల్ల సత్ఫలితాలను పొందవచ్చు
వృషభం :
ఏ పనిని ప్రారంభించినా రెట్టింపు ఉత్సాహంతో మీరు ముందుకు సాగుతారు ఆ. ఉత్సాహంతోనే మీరు ఆ పనుల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థికంగా కూడా శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. విందు వినోద కార్యక్రమాల్లో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు ముఖ్యంగా ఆత్మీయుల కలయిక విలో మానసిక ఉల్లాసాన్ని తీసుకొస్తుంది ఇష్టమైన దైవాన్ని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలను పొందవచ్చు.
మిథునం :
ఈ రాశి వారికి బంధుమిత్రుల సహాయ సహకారాలు మెండుగా లభిస్తాయి. ఏ పని చేపట్టినా సమయానికి పూర్తి చేసి పెద్దలనుంచి ప్రశంసలను పొందుతారు. ఇక ప్రయోగాత్మకమైన నిర్ణయాలతో గొప్ప విజయాలను సొంతం చేసుకుంటారు. మీరంటే గిట్టని వారితో మీరు జాగ్రత్తగా ఉండాలి .ఆచితూచి వారితో మాట్లాడాలి. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఆయన ప్రార్థన చేయడం వల్ల ఉత్తమమైన ఫలితాలు పొందవచ్చు.
కర్కాటకం :
ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. మనోబలంతో ముందుకు సాగితేనే విజయాలు సొంతం చేసుకోగలుగుతారు. స్థిరమైన నిర్ణయాలతో ముందుకు సాగాలి ఆస్థిరమైన నిర్ణయాలు కారణంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కొన్ని సంఘటనలు మీకు జ్ఞానోదయాన్ని కలిగిస్తాయి. ఈరోజు లింగాష్టకం చదవండి. మంచి జరుగుతుంది.
సింహం :
ఏ పని చేపట్టినా మీకు స్పష్టమైన ఆలోచన ఉండాలి. అది కరెక్ట్ గా చేస్తున్నానా లేదా అని ముందుగా నిర్ణయించుకున్న తర్వాతే ఆ పని ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ రాశి వారు అంకితభావంతో పని చేస్తారు. అయితే మీ పనిలో కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి ఒత్తిడి పెరగడం వల్ల గందరగోళంగా మీ మనసు ఉంటుంది. ఈ సమయంలో మీరు మీ ఒత్తిడిని తగ్గించుకునేందుకు కృషి చేయాలి. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి. ఈ రాశి వారు గణపతిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
కన్య :
ఈ రాశి వారు కాస్త ఓపికతో వ్యవహరించాల్సి ఉంటుంది. తొందరపాటు వల్ల పెద్దగా ఫలితాలు ఉండవు. మీరు తలపెట్టిన పనులు పూర్తవడానికి కాస్త సమయం పడుతుంది. ఏ పనులు అయినా అద్భుతమైన ఫలితాలను ఆశించకుండా మీకు ఇచ్చిన పనిని మీరు నూటికి నూరు శాతం పూర్తి చేయండి. . ఈ రాశిలోని క్రీడాకారులకు మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.ఉద్యోగస్తులు కూడా సానుకూలంగానే ఉంది. కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా గడపాలి. ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తలు అవసరం. ఇష్టమైన దైవారాధన చేయడం వల్ల మంచి జరుగుతుంది.
తుల :
ఈ రాశి వారు చెప్పుడు మాటలు వినకుండా ముందుకు వెళ్లాలి నిజాలు తెలుసుకోకుండా ఇతరులు చెప్పేది వినడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీ పని వ్యక్తిత్వాన్ని దూరం నుంచి పరిశీలిస్తూ ఉంటారు. అయితే మీ వ్యక్తిత్వాన్ని చాలామంది అభినందిస్తారు. ఒక క్లిష్టమైన సమస్య పరిష్కారం కోసం మీ స్నేహితుడు మిమ్మల్ని ఆశ్రయించే అవకాశం ఉంది. వారికి మీ సహాయ సహకారాలు కూడా అందిస్తారు.మీరు ఏ పని చేపట్టినా విజయాలు సాధిస్తారు. శ్రీరామ నామాన్ని జపించడం వల్ల శుభ ఫలితాలు పొందవచ్చు.
వృశ్చికం :
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళ్లే వారికే ఖచ్చితమైన ఫలితాలు కనిపిస్తాయి. చేపట్టే పనుల్లో కాస్త ఆటంకాలు ఏర్పడతాయి అయినప్పటికీ మనోధర్యంతో మీరు ముందుకు సాగుతారు. ఈ రాశి వారు ఒకవేళ టీం లీడర్ గా ఉన్నట్లయితే మీరు తీసుకునే నిర్ణయాల పైన మీ సభ్యుల ఫలితాలు ఆధారపడి ఉంటాయి ఇక కొంతమంది వ్యక్తులు మీ ప్రతిభను ప్రశంసిస్తారు. మీ జీవిత భాగస్వామి నుంచి కొన్ని సమస్యలు ఏర్పడవచ్చు వాటిని అధిగమించడం కోసం మీరు ఆమెతో మాట్లాడాల్సి ఉంటుంది. ఈ రాశి వారు చంద్ర ధ్యానం చేయడం శుభప్రదం.
ధనుస్సు :
మీరు కష్టేఫలి అనే సిద్ధాంతాన్ని నమ్ముకున్న వ్యక్తులు మీ కష్టం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. బంధుమిత్రులతో చిన్నచిన్న వివాదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారితో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. మీ విలువైన వస్తువులను మీరు జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కొన్ని కొన్ని పనుల్లో మీకు ఆటంకాలు ఏర్పడవచ్చు అయినప్పటికీ మీరు ముందుకు సాగుతారు ట్రాన్స్ఫర్ లేదా డిపార్ట్మెంట్ మారే అవకాశం ఉంది. శివనామ స్మరణ చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకుంటారు.
మకరం :
ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాన్ని ఒకవేళ మీరు తలపెట్టినట్లయితే దానికోసం అధ్యయనం అవసరం. శోధన చేసిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలి. ఒకవేళ మీరు వ్యాపారం చేయాలనుకుంటే మీ ఆలోచనలు తోటి వారితో పంచుకోండి అయితే ఆ వ్యాపారానికి సంబంధించి మీకు ఏదైనా సమాచారం తెలిసే అవకాశం ఉంటుంది. సాధ్యను సాధ్యాలను మీరు అంచనా వేయవచ్చు. మీ అధికారులతో మీరు జాగ్రత్తగా వ్యవహరించండి అనవసర భయాందోళనకు గురవుతారు. మీ కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తను వింటారు మీ పిల్లల ప్రతిభకు పురస్కారాలు కూడా అందుతాయి. శని ధ్యానం చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.
కుంభం :
దైవ బలంతో మీరు ఏ పని చేపట్టిన వాటిలో సత్ఫలితాలు సాధిస్తారు. భవిష్యత్తులో మీరేం చేయాలనుకుంటారో ఇప్పటినుంచే ప్లాన్ వేస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులైన వ్యాపారస్తులైన ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు కొత్త ఒక వస్తువులను కొనుగోలు చేస్తారు. వారు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల శుభం కలుగుతుంది.
మీనం :
కొన్ని కొన్ని కీలకమైన విషయాల్లో మీ తోటి వారి సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ సొంత నిర్ణయాలు మీకు అంతగా ఫలించకపోవచ్చు. మంది ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. వారి గురించి ఆలోచిస్తూ సమయం వృధా చేయకండి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి నవగ్రహ ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.
VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

3 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

3 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

This website uses cookies.