Bala Krishna : టాలీవుడ్ స్టార్ హీరో బాలయ్య ఏది చేసినా సెన్సేషనే సినిమాల దగ్గర నుంచి టీవీ షోలో వరకు బాలయ్య అడుగుపెడితే హిస్టరీ రిపీట్ అవ్వాల్సిందే. మరి బాలయ్య కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది మరి. తన స్టార్ ఇమేజ్ ను ఏమాత్రం చూసుకోకుండా ప్రతి విషయంలో ప్రయోగాలకు పెద్ద పీట వేస్తూ ఉంటారు బాలయ్య. బాలయ్య ఓ టీవీ షో చేయడం అంటే అదొక క్రేజీ విషయం. చిరంజీవి, ఎన్టీఆర్, నాగార్జున, నాని ఇలా చాలామంది తారలు టీవీ మీద మెరిసినా బాలయ్య లెక్క వేరే. ఆన్ స్థాపబుల్ ప్రోగ్రాం తో కనీ వినీ ఎరుగని రికార్డ్స్ బ్రేక్ చేశాడు బాలయ్య. బుల్లితెర మీద స్టార్ హీరోల లైఫ్ సీక్రెట్స్ ను రివీల్ చేసి ఫాన్స్ ను ఖుషి చేశాడు. లేటెస్ట్ గా ఫుడ్ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇస్తూ మ్యాజిక్ చేయబోతున్నాడు బాలయ్య.
సినిమాలతో వచ్చిన క్రేజ్ కంటే బాలయ్యకు ఈ మధ్యకాలంలో అన్ స్టాపబుల్ తో వచ్చిన క్రేజే ఎక్కువ. బాల్యయ్యను గతంలో ఎన్నడూ చూడని విధంగా బాలయ్యను చూడడంతో ఫాన్స్ కూడా బాగా కనెక్ట్ అయిపోయారు. జై బాలయ్య అంటూ మోత మోగిస్తున్నారు. బుల్లితెర హిట్ కావడంతో ఇటు వాణిజ్య ప్రకటనల్లో కూడా కనిపిస్తూ బాలయ్య సందడి చేస్తున్నారు. ఇక దొరికిందే ఛాన్స్ అంటూ ఇప్పుడు హైటెక్ రెస్టారెంట్ ను హైటెక్ సిటీలో ఏర్పాటు చేసి ఫుడ్ ఇండస్ట్రీలో కూడా తనదైన క్రేజ్ ను సంపాదించుకునే పనిలో పడ్డాడు బాలయ్య.
బాలయ్య రెస్టారెంట్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అద్భుతమైన ఇంటీరియర్ తో అత్యాధునిక హంగులతో ఈ రెస్టారెంట్ ను నిర్మించాడు బాలయ్య. డైనింగ్ టేబుల్స్, సోఫాలు,ఇంటీరియర్ డెకరేటివ్స్, వాల్ పోట్స్ ఇలా ప్రతి దాంట్లో కూడా యూనిక్ నెస్ కనిపిస్తోంది. రెస్టారెంట్ గోడలు మొత్తం బాలయ్య ఫోటోలతో నింపేశారు డిజైనర్స్. రెస్టారెంట్ ఇంటీరియర్ మాత్రం అదుర్స్ అంటున్నారు. ఇప్పటికే ఈ పిక్స్ నెట్ లో వైరల్ అవుతున్నాయి. బాలయ్య రెస్టారెంట్ సూపర్ అంటూ ఫ్యాన్స్ మెచ్చుకుంటున్నారు.
సినీ సెలెబ్రిటీలు బిజినెస్ చేయడం కొత్తేమి కాదు. మహేష్ బాబు, ప్రభాస్, విజయ్ దేవరకొండ లాంటి స్టార్స్ ఇప్పటికీ మల్టీప్లెక్స్ లు వారి వారి సొంత ఊరిలో నిర్మించి మంచి వసూలను రాబడుతున్నారు. ఇక సందీప్ కిషన్ కూడా వివాహ భోజనంబు అంటూ హైదరాబాదులో వింతైన వంటలను అందిస్తూ భోజన ప్రియులను కృషి చేస్తున్నాడు. ఇక ఇట్స్ మై టైం అంటూ బాలయ్య కూడా ఫుడ్ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. సరికొత్త వంటకాలను పరిచయం చేసి హైదరాబాద్ వాసులను ఖుషి చేసేందుకు రెడీ అవుతున్నారు. మరి బాలయ్య బాబు ఈ రెస్టారెంట్ సక్సెస్ సాధించాలని మనము ఆశిద్దాం.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.